Breaking News

CARONA

ఇంకా విషమంగానే..

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఏ మార్పు లేదని.. ప్రణబ్​కు చికిత్స అందిస్తున్న ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్​ అండ్​ రెఫరల్​ ఆస్పత్రి తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆస్పత్రి వర్గాలు హెల్త్​ బులిటెన్​ విడుదల చేశాయి. ఈ నెల 10న ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్‌ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. […]

Read More

మొత్తం కేసులు @ 30 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 69,239 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కు చేరుకున్నది. నిన్న ఒక్కరోజే 912 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన వారిసంఖ్య 56,706 కు చేరింది. 57,989 మంది కోవిడ్‌ పేషంట్లు శనివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 22,80,567 […]

Read More
57వేలకు చేరువలో కరోనా మరణాలు

57వేలకు చేరువలో కరోనా మరణాలు

ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ ​కేసులు నమోదవుతున్నాయి. అదేస్థాయిలో మరణాలు కూడా రికార్డు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 912 మంది చనిపోయారు. ఇప్పటిదాకా దేశంలో కరోనా మరణాల సంఖ్య 57వేలకు చేరింది. మరో ఏడు లక్షల యాక్టివ్ ​కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ ​కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు […]

Read More
కష్టకాలంలో రియల్​హీరో

కష్టకాలంలో రియల్ ​హీరో

మానవాళిని వణికిస్తున్న కరోనాను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డుమీద పడ్డారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు, కార్మికులు ఎంతో మంది ఉన్నారు. సినిమా షూటింగ్ లు లేకపోవంతో చాలామంది ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కష్టకాలంలో వారిని ఆదుకోవడానికి ప్రముఖ సినీనటుడు సూర్య ముందుకొచ్చాడు. రూ.ఐదుకోట్ల భారీవిరాళం ప్రకటించి రియల్​లైఫ్​లోనూ తాను హీరో అనిపించుకున్నారు. డిజిటిల్ మీడియాకు తన లేటెస్ట్ సినిమా ‘ఆకాశమే హద్దురా’ విక్రయించడం […]

Read More
ఏపీలో 10,276 కరోనా కేసులు

ఏపీలో 10,276 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శనివారం కొత్తగా 10,276 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధిబారినపడి ఒకేరోజు 97 మంది మృతిచెందారు. మహమ్మారితో ఇప్పటివరకు 3,189 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసుల సంఖ్య 3,45,216కు చేరింది. గత 24 గంటల్లో కోలుకుని 8,593 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 61,469 మందికి పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 31,91,326 మందికి కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో […]

Read More
సెప్టెంబర్​10 నుంచి పార్లమెంట్ సమావేశాలు

సెప్టెంబర్​ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: సెప్టెంబర్​ 10వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ రోజు లోకసభ, మరోరోజు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు. స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని పేర్కొన్నారు. ఆయా […]

Read More

69వేల కేసులు.. 945 మరణాలు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 945 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు 55,794 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,631మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు. దీంతో వైరస్‌ను జయించిన వారి మొత్తం సంఖ్య 22,22,578 కు చేరింది. దేశంలో రికవరి రేటు కూడా […]

Read More

‘కరోనా’పై ఇంత నిర్లక్ష్యమా!

సారథిన్యూస్​, రామగుండం: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్​ చేశారు. కరోనా పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదని వారు విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంల్​ న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్​ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో కేవలం 88 మంది వైద్యసిబ్బంది మాత్రమే ఉన్నారని.. దీంతో రోగులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా […]

Read More