కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతోంది. చాలా కోట్ల వ్యాక్సిన్లు అందక, ఆక్సిజన్ దొరక్క జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ సహా, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే సంపూర్ణ లాక్ డౌన్ దిశగా వెళ్లాయి. కొవిడ్దెబ్బకు క్రికెట్మెగాఈవెంట్ఐపీఎల్14వ సీజన్ను బీసీసీఐ రద్దుచేసింది. దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మేమున్నామని.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ హీరోయిన్అనుష్క దంపతులు ముందుకొచ్చారు. కొవిడ్ బాధితులకు భారీవిరాళం ప్రకటించారు. రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు విరుష్క దంపతులు తెలిపారు. […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీ వరకు దస్తావేజు సేవలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులరాజు తెలిపారు. భూ విక్రయ కొనుగోలుదారులు, ప్రజలు సహకరించగలరని కోరారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
వేములవాడ టౌన్లో మిషన్ భగీరథ కోసం తవ్విన రోడ్లు రోడ్లపైనే మట్టి.. వాహనదారులకు ఇబ్బందులు ఇంట్లోకి వస్తున్న దుమ్ము.. ఊపిరిపీల్చుకునేందుకు కష్టం సారథి, వేములవాడ: పేరుకే సిమెంట్ రోడ్లు.. చూస్తే మట్టిరోడ్లను తలపిస్తున్నాయి. వేములవాడ పట్టణంలోని మిషన్ భగీరథ పనుల పేరుతో రోడ్లను తవ్వి మట్టిని వదిలేస్తున్నారు కాంట్రాక్టర్లు. మిషన్ భగీరథ పైపు లైన్ కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. పైగా ఈ రోడ్లపై వాహనాలు వెళ్తుంటే దుమ్మ రేగుతోంది. […]
కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాపిస్తున్న వేళ తిప్ప తీగ పేరు ఇప్పుడు తరుచుగా వినిపిస్తోంది. దీని గురించి సోషల్ మీడియా, పేపర్లు, టీవీ చానళ్లలో తెగ ప్రచారం జరుగుతోంది. అసలేమిటి తిప్పతీగ. దాని ప్రత్యేకతలు ఏమిటనే విషయాలను తెలుసుకోవాలని అందరిలోనూ ఉంది. పల్లెల్లో అయితే మన కళ్లముందే ఉంటున్నా దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు మనకు ప్రకృతిలో దొరుకుతున్నాయి. అందులో తిప్ప తీగ ఒకటి. కరోనా సమయంలో […]
సారథి, హైదరాబాద్: కరోనా సెకండ్వేవ్విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్అందక వందల సంఖ్యలో రోగులు చనిపోతున్న విషయం తెలిసిందే. అయితే మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తానని చెప్పింది. అందులో 70 టన్నుల వరకు సమకూరింది. మిగితా ఆక్సిజన్ ను బళ్లారి, బిలాయ్, అంగుల్ (ఒడిశా) పెరంబదూర్ […]
కరోనా రోగుల అంత్యక్రియల కోసం బంధువుల ఎదురుచూపులు వారణాసి, భోపాల్, ఇండోర్, ఘజియాబాద్, రాంచీల్లో కిక్కిరిసిన శ్మశానాలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మృత్యువిలయాన్ని సృష్టిస్తోంది. తొలిసారి లక్ష కేసులను దాటి పదిరోజుల్లోనే రెండో లక్షను అధిగమించిన మహమ్మారి ఇప్పుడు మృత్యుపంజా విసురుతోంది. ఒకవైపు కరోనా పేషెంట్లతో అంబులెన్సులు హాస్పిటళ్ల ముందు లైన్ కడుతున్నాయి. మరోవైపు శ్మశానవాటికల ముందు శవాల లైన్‌లు దర్శనమిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, వారణాసి, లక్నోతో […]
రూ.2వేలు, 25 కేజీల బియ్యం ప్రకటించిన సీఎం కేసీఆర్సారథి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నకారణంగా స్కూళ్లు మూతపడిన నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. టీచర్లు, సిబ్బందికి నెలకు 25 కేజీల బియ్యంతో పాటు రూ.రెండువేల ఆపత్కాల ఆర్థికసాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సహాయం పొందాలనుకునే టీచర్లు ప్రైవేట్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది తమ బ్యాంకు ఖాతా, వివరాలతో ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ అధికారులను సమన్వయం […]
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు హెల్త్‌సెంటర్‌ను డీఎంహెచ్‌వో డాక్టర్చందునాయక్ సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. 45ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కరోనా సెకండ్‌వేవ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైద్యులు, డాక్టర్లు సమయపాలన పాటించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అమరవాయి గ్రామంలో ఉన్న హెల్త్‌సబ్ సెంటర్ ను పరిశీలించి అక్కడ ఉన్న వైద్యసిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో […]