Breaking News

BILL

వ్యవసాయ బిల్లు ఆమోదంపై హర్షం

సారథి న్యూస్, రామడుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లు శనివారం పార్లమెంట్ లో ఆమోదం పొందటం పట్ల రామడుగు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగులో బీజేపీ నాయకులు నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్ట రవీందర్, అంజిబాబు, రాజేంద్రచారి, రాజు, సత్యనారాయణ, భరత్, శ్రీకాంత్, వెంకటేశ్​, గాలిపల్లి రాజు, శ్రీనివాస చారి, పోచమల్లు, మల్లేశం పాల్గొన్నారు.

Read More