Breaking News

BHOPAL

జీన్స్​పై నిషేధం

ఉద్యోగుల వస్త్రధారణపై ఆంక్షలు

భోపాల్‌: ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణపై మధ్యప్రదేశ్​ సర్కార్​ ఆంక్షలు విధించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులెవరూ జీన్స్​, టీషర్ట్​ ధరించి ఉద్యోగానికి రావొద్దని ఉత్తర్వలు జారీచేసింది. జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్‌సౌర్‌ జిల్లాలోని ఓ అధికారి పద్ధతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరుకావాలని […]

Read More
ప్రగ్యా టాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు

హనుమాన్​చాలిసా పఠిస్తే కరోనా రాదట

భోపాల్‌: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్​ చాలిసా పఠిస్తే కరోనా దరిచేరదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు శ‌నివారం ట్వీట్​ చేశారు. ‘క‌రోనాతో పోరాడేందుకు అంద‌రూ జూలై 25 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు ఐదు సార్లు హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. ఆఖ‌రి రోజు ఇంట్లో దీపాల‌ను వెలిగించి రాముడికి హార‌తి ప‌ట్టండి. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు హ‌నుమాన్ చాలీసాను ఒకే స్వ‌రంలో ప‌ఠిస్తే దానికి క‌చ్చితంగా […]

Read More

భోపాల్​లో సంపూర్ణ లాక్​డౌన్​

భోపాల్​: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాలు, కూరగాయలు, రేషన్​ దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్టు హోంమంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు. ఈ నెల 24 (శుక్రవారం) నుంచి 10 రోజులపాటు లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Read More

పెండ్లికి 20మందికే అనుమతి

భోపాల్​: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]

Read More