సారథి న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్7 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతో కలిసి గురువారం పరిశీలించారు. అసెంబ్లీ, శాసనమండలిలో భౌతికదూరం పాటించే విధంగా సభ్యులకు సీట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను […]
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బలపరీక్షలో నెగ్గారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ గెహ్లాట్ తనంతట తాను విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ ఈ నెల 21కి వాయిదా వేశారు. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా సహకరించడంతోనే అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.
పుదుచ్చేరి: కరోనా వైరస్ దెబ్బతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి సమావేశాలను ఆరుబయట చెట్ల కింద నిర్వహించింది. ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌జె జయబాల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయను హాస్పిటల్‌కు తరలించి.. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు బయటకు షిఫ్ట్ చేశారు. రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేశారు. జులై 20న పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తొలి రెండు రోజులు […]
అమరావతి: రాష్ట్ర శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. రెండు రోజుల పాటు సమావేశమైన శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నిరవధికంగా వాయిదా వేశారు. ఎన్‌ఆర్‌పీ, ఎన్‌పీఆర్ సవరణ బిల్లులను కూడా శాసనసభ ఆమోదించింది. ఇక మొత్తం 5:58 గంటల పాటు నిర్వహించిన శాసనసభలో 13 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, మొత్తం 15 బిల్లులకు ఆమోదాన్ని తెలిపింది. ఇక చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కు సంతాపం తెలిపిన […]