Breaking News

AP

ఏపీలో టెన్త్​ ఎగ్జామ్స్​ రద్దు

అమరావతి: పదవ తరగతి పరీక్షలను ఏపీలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. కరోనా నేపథ్యంలో.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేరెంట్స్​ ఆందోళన చెందుతున్న వేళ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం వెల్లడించారు.

Read More
బాధిత కుటుంబాలను ఓదార్చుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

బాధితకుటుంబాలకు ఓదార్పు

సారథిన్యూస్​, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ సీఎం కేసీఆర్​ రూ. 2 లక్షల పరిహారం అందించారు. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితకుటుంబాలకు రూ.20 వేలు తక్షణసాయం ప్రకటించారు. జిల్లా పరిషత్​ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, మంత్రి పువ్వాడ అజయ్​ బాధితకుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వదవాఖానలో చికిత్సపొందుతున్న వారిని ఖమ్మం ఎంపీ […]

Read More

పది మందిని బలిగొన్న రోడ్డుప్రమాదం

సారథిన్యూస్​, ఖమ్మం: రోడ్డుప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం వేదాద్రి సమీపంలో చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద గోపవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం బంధువులతోకలిసి వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ట్రాక్టర్​లో వెళ్తున్నారు. వేదాద్రి సమీపంలో ట్రాక్టర్​ను ఎదురుగా వచ్చిన బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరోముగ్గురు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పెదగోపవరంతోపాటు అదే మండలానికి చెందిన […]

Read More

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: జిల్లాలో మోడల్ ప్రాజెక్టును పక్కాగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్​ వ్యవసాయశాఖ కమిషనర్​ హనుమంతు అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టరేట్​లో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రాజెక్టు పథకం అమలుపై వ్యవసాయ, అనుబంధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ఆదర్శ రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతులు అధికాదాయం పొందాలని, ముఖ్యంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం […]

Read More

పేదలకు ‘జగనన్న చేదోడు’

సారథి న్యూస్​, శ్రీకాకుళం: నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ‘జగనన్న చేదోడు’ కార్యక్రమం చేపట్టామని ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి వివరించారు. బుధవారం వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టైలర్​ వృత్తిదారులు, నాయీ బ్రాహ్మణులు, రజకుల ఆర్థిక కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్నానని వివరించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అర్హులు ఏ ఒక్కరూ మిస్​ కాకూడదని సూచించారు. జూలై 8న ఇళ్లపట్టాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో స్పీకర్​ తమ్మినేని సీతారాం, మంత్రి […]

Read More

పోటీ పరీక్షల తేదీలు ఇవే..

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలు పోటీపరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫీజు, దరఖాస్తు తేదీ తదితర వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే కొన్నింటికి పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారుకాలేదు.AP POLYCET:అప్లై కి ఆఖరు తేది:15-06-2020ఫీజు:400పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.APRJC:అప్లై కి ఆఖరు తేది:30-05-2020ఫీజు:250పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.AP EAMCET:అప్లై కి ఆఖరు తేది:15-06-2020ఫీజు:500పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.TS EAMCET:అప్లై కి ఆఖరు తేది:10-06-2020ఫీజు:OC/BC-800SC/ST/PH-400పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.AP […]

Read More

జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. పరీక్షలు నాటికి కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. ప్రతి గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం 4,154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతాం తెలిపారు. […]

Read More

ఆర్​బీకేలతో విప్లవాత్మక మార్పులు

ఆంధ్రప్రదేశ్​ సభాపతి తమ్మినేని సారథి న్యూస్, శ్రీకాకుళం: రైతుభరోసా కేంద్రాలు (ఆర్​బీకే)రైతులకు బాసటగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్​ శాసనసభ స్పీకర్​ తమ్మినేని సీతారాం అన్నారు. గ్రామీణ వ్యవస్థలో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని వివరించారు. ఆమదాలవలస మండలం తొగారాం గ్రామంలో శనివారం ఆయన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే వైఎస్సార్​ క్లినిక్​ సెంటర్లు ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు. జిల్లాలో రూ.9.7 కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో సమీకృత ల్యాబ్​లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుభరోసా కింద జిల్లాలో […]

Read More