సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: పక్షులు, కోళ్లను బర్డ్‌ఫ్లూ మహమ్మారి కబళిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది. క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా బర్డ్‌ఫ్లూ మహమ్మారి పాకినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఉన్నట్టుండి 20 నుంచి 30 నాటుకోళ్లు ఒకేరోజు చనిపోవడం కలకలం రేపింది. ఈ కోళ్లకు బర్డ్‌ఫ్లూ వచ్చిందా? మరేదైనా కారణమా? అని బాధిత పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత […]
సారథి న్యూస్, కర్నూలు: ఏపీలో మంగళవారం కొత్తగా 1,155 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 16,238 శాంపిళ్లను పరీక్షించగా 1,178 కరోనా కేసులు తేలాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 21,197కు చేరింది. తాజాగా 13 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్రంలో 252 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో 10,50,090 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. […]
సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలించారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ […]
– ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి నివాళి సారథి న్యూస్, అనంతపురం: ఫిలిప్సైన్స్ లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రేవంత్ కుమార్(22) మృతదేహాన్ని శుక్రవారం స్వస్థలానికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. కదిరి, అనంతపురం పట్టణాలకు చెందిన రేవంత్‌కుమార్(22), వంశీ(19) ఫిలిప్సైన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఏప్రిల్ 6న అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. […]
సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని అనంతపురం నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేద్దామని జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు చెప్పారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మందులు దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారం చేయకూడదన్నారు. పాతఊరు తిలక్ రోడ్డు, గాంధీబజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని దుకాణాల వద్ద జనం గుమిగూడకుండా దృష్టిపెట్టాలన్నారు. దుకాణాల […]