Breaking News

AMARAVATHI

ఏపీలో 10,276 కరోనా కేసులు

ఏపీలో 10,276 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శనివారం కొత్తగా 10,276 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధిబారినపడి ఒకేరోజు 97 మంది మృతిచెందారు. మహమ్మారితో ఇప్పటివరకు 3,189 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసుల సంఖ్య 3,45,216కు చేరింది. గత 24 గంటల్లో కోలుకుని 8,593 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 61,469 మందికి పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 31,91,326 మందికి కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో […]

Read More

బీజేపీలోకి వంగవీటి రాధా

అమరావతి: టీడీపీ నేత వంగవీటి రాధా.. బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ తాను కోరుకున్న టికెట్​ ఇవ్వలేదని టీడీపీలో చేరారు. టీడీపీ సైతం టికెట్​ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ పార్టీతరఫున ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు, లోకేశ్​బాబు పార్టీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన బీజేపీకి చెందిన ఓ కీలకనేతతో సంప్రదింపులు […]

Read More

‘రాజధాని వివాదం’ కేంద్రం క్లారిటీ

ఢిల్లీ: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత నిచ్చింది. రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని.. అది కేంద్రం పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టులో కేంద్రం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాల నేపథ్యంలో దోనే సాంబశివరావు అనే […]

Read More
ఏపీలో 3లక్షలు దాటిన కేసులు

ఏపీలో 3లక్షలు దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మంగళవారం 9,652 కరోనా కేసులు నమోదుయ్యాయి. ఇప్పటివరకు మొత్తంగా 3,03,366 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. తాజాగా, వ్యాధిబారిన పడి 88 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తంగా 2,820 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చికిత్స అనంతరం 2,15,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 85,130కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం 445, చిత్తూరు 990, ఈస్ట్​ గోదావరి 1396, గుంటూరు 895, కడప 755, […]

Read More
పేదలకు ఊరట

పేదలకు ఊరట

దరఖాస్తుచేసుకున్న వారం లోపే రేషన్​కార్డుల్లో పేర్లు ఎంట్రీ 1.50 కోట్ల కార్డుల్లో 4.34 కోట్ల మంది పేర్లు గతంలో కార్డుల్లో పేర్లు నమోదుకు అనుమతి నిరాకరణ అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బియ్యం కార్డుల్లో కొత్తగా కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పలుకారణాలతో పేర్లు నమోదు కాకపోవడం, కొత్తగా జన్మించిన వారి పేర్లు ఎంట్రీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారంలోపే కార్డుల్లో పేర్లు నమోదు చేస్తున్నారు. గత నాలుగు […]

Read More
ఆంధ్రప్రదేశ్​లో 8,732 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 8,732 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 87 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,650కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 1,91,117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ ​అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 580, చిత్తూరు 981, ఈస్ట్ ​గోదావరి 875, గుంటూరు 590, కడప 286, కృష్ణా […]

Read More
ఏపీలో 8,732 కరోనా కేసులు

ఏపీలో 8,732 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. తాజాగా 87మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి దాకా మృతుల సంఖ్య 2,562కు చేరింది. మొత్తం 53,712 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 88,138గా నమోదైంది. ఇప్పటివరకు 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.

Read More
ఆంధ్రప్రదేశ్​లో 8,943 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 8,943 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,70,190 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 97 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,475కు చేరింది. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 9,779 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు వ్యాధి నయం అయినవారు 1,80,703 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,58,485 కరోనా పరీక్షలు చేశారు. […]

Read More