Breaking News

ALAMPUR

ఓటు వేసిన ప్రముఖులు

ఓటు వేసిన ప్రముఖులు

సారథి న్యూస్, అలంపూర్​: ఇటిక్యాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్​కేంద్రంలో అలంపూర్​ఎమ్మెల్యే డాక్టర్​వీఎం అబ్రహం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇక్కడే మాజీ ఎంపీ మందా జగన్నాథం ఓటు వేశారు. మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ సరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానవపాడు పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పరిశీలించారు.

Read More
ఎమ్మెల్సీగా వాణిదేవిని గెలిపించండి

ఎమ్మెల్సీగా వాణిదేవిని గెలిపించండి

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ​పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభివాణి దేవిని అధిక మెజార్టీతో గెలిపించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ ​సరిత తిరుపతయ్య పట్టభద్రులను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో మానవపాడు మండలం, పల్లెపాడు, బోరవెల్లి, చండూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల […]

Read More
ప్రభుత్వ సంస్థలు లేకపోతే.. ఉద్యోగాలుండవ్​

ప్రభుత్వ సంస్థలు లేకపోతే.. ఉద్యోగాలుండవ్​

సారథి న్యూస్, అలంపూర్​(మానవపాడు): జోనల్ వ్యవస్థకు అనుమతించకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డి విమర్శించారు. దేశంలో న్యాయవాదులకు రూ.100 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్​ఫంక్షన్ హాల్ లో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అధ్యక్షతన టీఆర్ఎస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన […]

Read More
జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు రండి

జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు రండి

సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన కలిసిన వారిలో దేవాదాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ​గువ్వల బాలరాజ్​, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Read More
ఉద్యోగులకు సీపీఎస్​శాపం

ఉద్యోగులకు సీపీఎస్​ శాపం

సారథి న్యూస్, మానవపాడు: సీపీఎస్ విధానం ద్వారా 1.5లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎస్ ​జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో అగ్రికల్చర్​ ఆఫీసర్ ​శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ ​రవికుమార్ ​చేతులమీదుగా టీఎస్​సీపీఎస్ ఈయూ క్యాలెండర్​ను ఆవిష్కరించారు. సీపీఎస్​ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ ​చేస్తూ వచ్చేనెల 14న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను కాపాడాలని రాష్ట్ర సలహాదారుడు విష్ణు కోరారు. […]

Read More
భూసారం పెంచుదాం

భూసారం పెంచుదాం

సారథి న్యూస్, మానవపాడు: సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ సంచాలకుడు సక్రియ నాయక్ రైతులకు సూచించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దఆముదాలపాడు గ్రామంలో ‘భూసార పరీక్ష.. సుస్థిర వ్యవసాయం’పై అలంపూర్​డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భావితరాలకు అవసరమైన భూములను అందిద్దామని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మానవపాడు మండల […]

Read More
అలంపూర్​లో స్వేరో సంబరాలు

అలంపూర్​లో స్వేరో సంబరాలు

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: ఈనెల 13, 14 తేదీల్లో అలంపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న స్వేరో సంబరాలను విజయవంతం చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బూడిదపాడ్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పరుగు పందెం, లాంగ్​జంప్, షార్ట్​పుట్, కవితలు, పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం.. తదితర పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంబరాలకు బూడిదపాడ్, కలుగొట్ల […]

Read More
వాడీవేడిగా మానవపాడు జనరల్​బాడీ మీటింగ్​

వాడీవేడిగా మానవపాడు జనరల్​బాడీ మీటింగ్​

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమస్యలపై నిలదీస్తూ పలువురు సర్పంచ్​లు సమావేశాన్ని అడ్డుకున్నారు. పంచాయతీలో చేస్తున్న ప్రతి పనికి కమీషన్లు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారుల తీరుకు నిరసనగా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, సర్పంచ్​లతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. బుధవారం ఎంపీడీవో ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోట్ల అశోక్​రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్​పర్సన్ సరిత […]

Read More