Breaking News

ACTOR

నటుడు సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు

సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు

యాక్సిండెంట్‌కు సంబంధించి వివరాలు కోరిన పోలీసులు సామాజికసారథి, హైదరాబాద్‌: సినీ హీరోసాయి ధరమ్‌ తేజ్‌ గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్‌తేజ్‌.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తేజ్‌ యాక్సిడెంట్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్‌తేజ్‌పై ఛార్జ్‌ […]

Read More

సూర్య ఇంటికి బాంబు బెదిరింపు

తమిళనాడులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. ఇటీవల పలువురు సినీ, రాజకీయప్రముఖుల ఇంట్లో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్లు​ రావడం.. తీరా పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపడితే ఏమీ దొరకపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, అజిత్‌, మ‌ణిర‌త్నం, విజ‌య్ తదితరుల ఇంట్లో బాంబులు పెట్టామంటూ ఆకతాయిలు ఫోన్లు చేశారు. విచారించిన పోలీసులకు అవన్నీ ఫేక్​కాల్స్​ అని తేలింది. అయితే తాజాగా ప్రముఖ హీరో ఇంట్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. చెన్నై అల్వార్‌పేట ఏరియాలో […]

Read More

కరోనాతో హాస్యనటుడు మృతి

తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్​.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్​ […]

Read More
రోహిత్​.. ఇది నిజమా..?

రోహిత్​.. ఇది నిజమా..?

త్వరలోనే‘ పుష్ప’ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పక్కా మాస్ మ్యాన్​గా చూపించనున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్​లో నిర్మితమయ్యే ఈ చిత్రంలో పుష్పరాజ్ అన్న క్యారెక్టర్ ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. పల్లెటూరి పెద్దగా కనిపించే ఆ రోల్ కు మొదట తమిళ నటుడు ఆదిని అనుకున్నారు. కానీ ఇప్పుడో టాలీవుడ్ హీరోను తీసుకుంటున్నట్టుగా సమాచారం. అంచనాలకు అందని విధంగా నారా రోహిత్ […]

Read More

వెబ్​సీరీస్ ప్లానింగ్​లో అర్జున్​రెడ్డి డైరెక్టర్​

అర్జున్​రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్​ వంగ ఓ వెబ్​సీరీస్​ తీసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ వెబ్​సీరీస్​ను యంగ్​ హీరో విజయ్​ దేవరకొండ నిర్మించనున్నట్టు టాక్​. అర్జున్​రెడ్డి చిత్రాన్ని సందీప్​వంగా హిందీలో కబీర్​సింగ్​గా తెరకెక్కించి సూపర్​ హిట్​ అందుకున్నాడు. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఈ క్రమంలో ఓ విభిన్న కథతో వెబ్​సీరీస్​ను తెరకెక్కెంచనున్నట్టు టాక్​. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ లీడ్​ పాత్రలో నటిస్తారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. […]

Read More
సంజయ్​దత్​కు క్యాన్సర్​

సంజయ్​దత్​కు క్యాన్సర్​

ముంబై: బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​కు ఉపిరితిత్తుల క్యాన్సర్​ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్​ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. కాగా సంజయ్​ మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్నట్టు సమచారం. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్​ 2, శమ్​షేరా తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సంజయ్​ నటించిన కొన్ని వెబ్​సీరిస్​లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Read More
పృథ్విరాజ్​కు కరోనా

నటుడు పృథ్విరాజ్​కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నేత పృథ్విరాజ్​కు కరోనా అంటుకుంది. పదిరోజుల నుంచి ఆయన తీవ్రజ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో వైద్యుల సూచనమేరకు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​ వచ్చినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైద్యుల సూచన మేరకు తాను 15 రోజులు క్వారంటైన్​లో ఉంటానని చెప్పారు.

Read More

కన్నడ యువ నటుడు ఆత్మహత్య

కన్నడ యువనటుడు సుశీల్​గౌడ ​(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మ హత్య చేసుకొని అందరికి షాక్ ఇవ్వగా..తాజాగా మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని సినీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక మాండ్యలో ఉన్న తన ఇంట్లో సుశీల్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సుశీల్ ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనను తాను […]

Read More