Breaking News

ACHAMPET

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

అడవుల రక్షణ అందరి బాధ్యత

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మియావాకి ప్లాంటేషన్ ను శుక్రవారం కలెక్టర్ ఎల్.శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను పెంచేలా జపాన్‌ మియావాకీ పద్ధతిలో నాటడం ద్వారా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానంతో ప్రతి పట్టణ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో నాటి చిట్టడవులను […]

Read More
ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదు

ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదు

సారథి, అచ్చంపేట: ఆదాయం కోసం సర్కారు భూములను అమ్మడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా నాయకురాలు, అచ్చంపేట 10వ వార్డు కౌన్సిలర్ సునీతారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజా అవసరాలు స్కూళ్లు, ఆస్పత్రులు, గోదాములు తదితర వాటి కోసం ప్రభుత్వ ఆస్తులను వినియోగించాలి కానీ ఇలా విక్రయించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో తెలంగాణ ఆదాయమంతా ఎవరి […]

Read More
పెట్రోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు..

పెట్రోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు..

సారథి, అచ్చంపేట: నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల నడ్డి విరుస్తున్నాయని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ పెట్రోలు రేట్లు పెంచుతూ పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో ఏడాది నుంచి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. 10నెలల కాలంలో పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై 26 పెంచారని ఆయన […]

Read More
మా భూములకు రక్షణ కల్పించండి

మా భూములకు రక్షణ కల్పించండి

సారథి, అచ్చంపేట: తమ భూములకు రక్షణ కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామానికి చెందిన గిరిజన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అటవీశాఖ అధికారులు గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ గతంలో ఉన్న ఫారెస్ట్ హద్దు కాకుండా సాగుభూముల్లో జేసీబీతో బౌండరీ తీయడానికి రావడంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఈ భూములకు 2006లో అటవీహక్కుల చట్టం ప్రకారం దాదాపు 12 మంది రైతులకు పట్టాలిచ్చారు. అప్పటి నుంచి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం […]

Read More
పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ గొప్ప నిర్ణయం

పేదలకు ఉచిత వ్యాక్సిన్ గొప్ప నిర్ణయం

సారథి, అచ్చంపేట: దేశంలో ఉన్న అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం గొప్ప నిర్ణయమని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాఘవేందర్ కొనియాడారు. ఇప్పటి వరకు కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 18ఏళ్లు పైబడిన వాళ్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలన్న నిర్ణయం చూస్తుంటే కరోనా నుంచి దేశప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యమన్నారు. అంతే కాకుండా దీపావళి(నవంబర్) వరకు దేశంలో గరీబ్ కళ్యాణ్ […]

Read More
చ్చంపేట ఆస్పత్రికి 4 కాన్సన్ ట్రేటర్లు

అచ్చంపేట ఆస్పత్రికి 4 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు

సారథి, అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విజ్ఞప్తి మేరకు స్థానిక సివిల్ ఆస్పత్రికి నాలుగు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు స్పోటన్ లాజిస్టిక్ సంస్థ వారు, అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి, డీఎంహెచ్ వో డాక్టర్ కె.సుధాకర్ లాల్ చేతులమీదుగా మంగళవారం అందజేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించగలమని డీఎంహెచ్ వో అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, స్పోటన్ లాజిస్టిక్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ […]

Read More
సీడ్ డీలర్ షాపుల తనిఖీ

విత్తన షాపుల్లో తనిఖీలు

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బల్మూ ర్, కొండనాగుల, రామాజిపల్లి గ్రామాల్లోని సీడ్ డీలర్ షాపులను మండల వ్యవసాయాధికారి మహేష్ కుమార్, ఇన్ చార్జ్ సబ్ ఇన్ స్పెక్టర్ కృష్ణయ్య మంగళవారం తనిఖీచేశారు. డీలర్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను మాత్రమే అమ్మాలని, లూజ్ సీడ్స్ ను అమ్మకూడదని, కొనుగోలు చేసే రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. షాపు బయట ధరలపట్టిక, స్టాక్ బోర్డు ఉంచాలని ఆదేశించారు. నకిలీ సీడ్ […]

Read More
సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూలులో కరోనా సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్ శుక్రవారం సందర్శించారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాలు తీర్చే రేషన్ డీలర్లు, జర్నలిస్టులు, గ్యాస్, పెట్రోల్ బంక్ కార్మికులు, ఎరువుల దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తదితరులకు ప్రధాన వాహకులుగా భావించి వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ […]

Read More