సారథి, చొప్పదండి: ఏబీవీపీ చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడెల్లి లక్మిపతి మాట్లాడుతూ.. తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా నిలిచారని కొనియాడారు. శక్తివంతమైన మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించి, బానిసత్వపు సంకెళ్లు తెంచి, మాతృదేశ విముక్తికి వీరోచితంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్తిక్, సంకేర్త్, అక్షయ్, చందు, వేణు, రాజు, ఉప్పి, అజయ్, ప్రమోద్ పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ రెండవ రోజు భాగంగా శనివారం పట్టణంలోని బస్టాండ్ , పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీసు, పీహెచ్ సీల వద్ద సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ ఆసిఫ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ ఆపద వచ్చినా ఏబీవీపీ ముందుండి విద్యార్థుల సమస్యలే కాకుండా […]
సారథి న్యూస్, చొప్పదండి: ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పట్టణ ఉపాధ్యక్షుడు అనుమల్ల కోటేశ్ డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు కరోనా సాకుతో ఆన్లైన్ క్లాసులంటూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శక్తిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలన్నారు. చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, సాయి గణేష్, లక్ష్మీపతి, అఖిల్, […]
సారథిన్యూస్, సిరిసిల్ల: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బుధవారం ఏబీవీపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరిసిల్లోని విద్యానగర్ లో అనుమతి లేకుండా శ్రీచైతన్య పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేని రంజిత్‌కుమార్, నాయకులు ప్రశాంత్, వినయ్, ప్రణయ్ తదితరులు ఉన్నారు.