Breaking News

TELANGANA

నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు

నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు

సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా ఉన్న ప్రజాప్రతినిధులు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆగ్రహంలో కొట్టుకపోకతప్పదని మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్​జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని చిక్కడపల్లి సెంట్రల్​ లైబ్రరీ, ఆర్సీరెడ్డి స్టడీ సెంటర్, పలు స్టడీ సెంటర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ […]

Read More
మేడారం ఆలయంలో దర్శనాలు నిలిపివేత

మేడారం ఆలయంలో దర్శనాలు నిలిపివేత

సారథి న్యూస్, తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సోమవారం నుంచి సమ్కక్క, సారలమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వనదేవతల పూజారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మార్చి 1 నుంచి 21వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు.

Read More
రైతులకు ఉచితంగానే ట్రాన్స్​ఫార్మర్లు

రైతులకు ఉచితంగానే ట్రాన్స్​ఫార్మర్లు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా రైతుల శ్రేయస్సుకు 24 గంటల పాటు ఉచితంగా కరెంట్​ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. రూపాయి ఖర్చులేకుండా రైతులకు ఉచితంగా ట్రాన్స్​ఫార్మర్లను అందిస్తున్నామని తెలిపారు. బుధవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 132/33 కేవీ విద్యుత్​ సబ్​స్టేషన్​ను మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 7,778 మెగావాట్ల సామర్థ్యం […]

Read More
కరోనాపై అలర్ట్​గా ఉండండి

కరోనాపై అలర్ట్​గా ఉండండి

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్​రావు అలర్ట్​ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారుల‌తో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు […]

Read More
ఇగ 6,7,8 క్లాసెస్​షురూ

ఇగ 6,7,8 క్లాసెస్ ​షురూ

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి 6, 7, 8వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తరగతులను మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మంత్రి స్పష్టంచేశారు.

Read More
నేడు, రేపు వర్షాలు

నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణమంతా చల్లబడి చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు గజగజవణికిపోతున్నారు. శని, ఆదివారాల్లో కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​లోనూ శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు, దక్షిణ కోస్తాలో ఉరుములు, […]

Read More
మోసం చేయడం ఆయన నైజం: భట్టి

మోసం చేయడం ఆయన నైజం : భట్టి

సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ ​మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ […]

Read More
తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి

తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి

ఢిల్లీ/ఖమ్మం: తెలంగాణ మాదిరిగానే అన్నిరంగాల్లో జమ్ముకాశ్మీర్ లో కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జమ్ముకాశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ పై శనివారం లోక్ సభలో జరిగిన చర్చలో ఎంపీ నామా పాల్గొన్నారు. చట్టంలో తీసుకొచ్చిన రెండు సవరణలు అవసరమేనని అన్నారు. జమ్మూకాశ్మీర్ బిల్లు 2019లో లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా టీఆర్​ఎస్​ పూర్తిమద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు కూడా తాజాగా తీసుకొచ్చిన రెండు సవరణలకు […]

Read More