Breaking News

TELANGANA

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్, బెజ్జంకి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల పేర్కొన్నారు. గురువారం బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఆమె తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత, మార్కెట్ కమిటి చైర్మన్ పోచయ్య, సర్పంచ్ సీతా లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూమయ్య, ఎంపీటీసీ మల్లేశంగౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More
బాధిత కుటుంబాలను ఓదార్చుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

బాధితకుటుంబాలకు ఓదార్పు

సారథిన్యూస్​, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ సీఎం కేసీఆర్​ రూ. 2 లక్షల పరిహారం అందించారు. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితకుటుంబాలకు రూ.20 వేలు తక్షణసాయం ప్రకటించారు. జిల్లా పరిషత్​ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, మంత్రి పువ్వాడ అజయ్​ బాధితకుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వదవాఖానలో చికిత్సపొందుతున్న వారిని ఖమ్మం ఎంపీ […]

Read More

ప్రధానకూడలికి సంతోష్ బాబు​ పేరు

సారథిన్యూస్​, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలికి అమరజవాన్​ కల్నల్​ సంతోష్​బాబు పేరు పెడతామని రాష్ట్ర మంత్రి జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో నిర్వహించిన కల్నల్​ సంతోష్​బాబు అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగదీశ్​రెడ్డి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసారం గ్రామాన్ని కల్నల్​ సంతోష్​బాబు జ్ఞాపక చిహ్నంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున అన్నివిధాలా సాయం చేస్తామని చెప్పారు. చైనా సైన్యాన్ని తరిమికొట్టడంతో కల్నల్ […]

Read More

269 కరోనా కేసులు నమోదు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా పాజిటివ్​ ఉధృతి పెరుగుతోంది. బుధవారం తాజాగా 269 కేసులు నమోదయ్యాయ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 5,675కు చేరింది. ఇందులో యాక్టివ్​ కేసులు 2,412 ఉన్నాయి. ఇప్పటి వరకు 3071 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. బుధవారం ఒకరు చనిపోయారు. దీంతో మొత్తంగా తెలంగాణలో 192 మంది చనిపోయారు. తాజాగా అత్యధికంగా 214 కేసులు జీహెచ్ఎంసీ పరిధి నుంచే నమోదయ్యాయ.

Read More

లోవోల్టేజీ సమస్య పరిష్కరిస్తాం

సారథిన్యూస్, బిజినేపల్లి: లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు కొత్త సబ్​స్టేషన్లను నిర్మిస్తున్నామని నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని నూతన కేవీ సబ్​స్టేషన్​ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడూతూ.. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్​ సమస్య పరిష్కారమైందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి , సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిరణ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి , […]

Read More

కొండపోచమ్మ నిర్వాసితులకు పరిహారం

సారథి న్యూస్, రామాయంపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్​​లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అధికారులు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని నార్లాపూర్​ గ్రామంలో 178 మంది కొండపోచమ్మ రిజర్వాయర్​లో భూములు కోల్పోయారు. వీరికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం చెక్కులను పంపిణీ చేశారు. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నిండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. […]

Read More

ఇంటర్​ ఫలితాలు తెలుసుకోండి ఇలా

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అయితే ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఫలితాలు విడుదల చేయాలనుకున్నారు. అందుకే ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమై ఇంటర్ ఫలితాల గురించి చర్చించనున్నారు. తెలంగాణ […]

Read More

పది మందిని బలిగొన్న రోడ్డుప్రమాదం

సారథిన్యూస్​, ఖమ్మం: రోడ్డుప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం వేదాద్రి సమీపంలో చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద గోపవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం బంధువులతోకలిసి వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ట్రాక్టర్​లో వెళ్తున్నారు. వేదాద్రి సమీపంలో ట్రాక్టర్​ను ఎదురుగా వచ్చిన బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరోముగ్గురు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పెదగోపవరంతోపాటు అదే మండలానికి చెందిన […]

Read More