Breaking News

CARONA

కరోనా కాదు.. ఫ్లూ అనుకున్నా

కరోనా కాదు.. ఫ్లూ అనుకున్నా

లండన్: ఈ ఏడాది ఆరంభంలోనే తనకు కరోనా సోకినా.. దాని గురించి పెద్దగా తెలియకపోవడంతో తీవ్రమైన ఫ్లూగా అర్థం చేసుకున్నానని ఇంగ్లండ్ మాజీ మాజీ ఆల్​రౌండర్​ ఇయాన్ బోథమ్ వెల్లడించాడు. ‘డిసెంబర్ చివర, జనవరి మొదట్లో నాకు కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే దీనికి గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో ఫ్లూ చాలా తీవ్రంగా వచ్చిందని తప్పుగా అర్థం చేసుకున్నా. దీని గురించి పెద్దగా తెలియపోవడంతో చాలా రోజుల బాధపడ్డా. కానీ తర్వాత తగ్గిపోయింది. […]

Read More
అన్‌లాక్‌-2: కేంద్రం కీలక గైడ్​లైన్స్​

అన్‌లాక్‌-2: కేంద్రం కీలక గైడ్​లైన్స్​

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కంటైన్‌మెంట్‌ జోన్లలో కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31వరరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగనుంది. […]

Read More
కరోనా రోగులపై వివక్ష వద్దు

కరోనా రోగులపై వివక్ష వద్దు

సారథి న్యూస్​, నల్లగొండ: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారిని చూసి హేళనగా మాట్లాడకూడదని, చుట్టుపక్కల వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్​ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇంటి యజమానులు వేధిస్తున్నట్లు, ఇల్లు ఖాళీ చేయమని ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. సరైన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడం […]

Read More
15వేల మార్క్​దాటిన కరోనా

15వేల మార్క్ ​దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి 15వేల మార్క్​ దాటింది. సోమవారం తాజాగా తెలంగాణలో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,394 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు, మేడ్చల్ జిల్లాలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Read More
దారుణంగా కరోనా పరిస్థితి

దారుణంగా కరోనా పరిస్థితి

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కరోనా కేసులు రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని ఇందులో కూడా పారదర్శకత లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 32.1 శాతంగా ఉందని ఆయన ఆందోళన […]

Read More
ఇంట్లోనే తొలి ఏకాదశి జరుపుకోండి

ఇంట్లోనే తొలి ఏకాదశి జరుపుకోండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జూలై 1న తొలి ఏకాదశి పర్వదినాన్ని మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రాకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు. సోమవారం ఆయన విలేకరులో మాట్లాడారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకి రాకుండా ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు.

Read More
వణుకుతున్న ప్రపంచం

వణుకుతున్న ప్రపంచం

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిల్లాడుతోంది.. మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. అడ్డుకోవడం ఏ దేశం తరం కావడం లేదు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి పైగా నమోదయ్యాయన్న వార్త ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉండడంతో రెట్టింపు స్థాయిలో కేసులు […]

Read More

పిచ్చాసుపత్రిలో 23 మందికి కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. తాజాగా ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 8 మంది పిల్లలతోపాటు 23 మందికి కరోనా సోకింది. ఈ ఆశ్రమంలో 960 మంది మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఈ నెల 5నుంచి 20వతేదీ వరకు మానసిక వికలాంగుల ఆశ్రమంలో కరోనా పరీక్షలు చేయగా 23 కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ముగ్గురు […]

Read More