సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని వ్యాపారసంస్థలు రెండు నెలల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునే అవకాశం ఉందని, వ్యాపారుల ఆర్థికపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సమయాన్ని సాయంత్రం వరకు పెంచాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. వ్యాపారులు అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోగా అందులో పనిచేసే వారికి జీతాలు చెల్లించే పరిస్థితి లేక తమ వ్యాపారాలను వదులుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అన్‌లాక్ సమయంలో పెద్ద నగరాల్లో సాయంత్రం వరకు […]
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కంటైన్మెంట్ జోన్లలో కేంద్రం లాక్డౌన్ పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్‌లాక్ -2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లలో జులై 31వరరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్పై నిషేధం కొనసాగనుంది. […]