Breaking News

CARONA

కంటైన్​మెంట్​ జోన్లపై నజర్​

కంటైన్​మెంట్​ జోన్లపై నజర్​

సారథి న్యూస్, కర్నూలు: కరోనా విజృంభణ నేపథ్యంలో కర్నూలు నగరంలోని కంటైన్​మెంట్​జోన్లలో లాక్ డౌన్ పరిస్థితిని శనివారం కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ సమీక్షించారు. నగరంలోని రాజ్ విహార్ సర్కిల్ మీదుగా కొండారెడ్డి బురుజు, మాలగేరి, వడ్డేగేరి, పెద్దమార్కెట్, పూలబజార్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, గనిగల్లీ నగర్, ఉస్మానియా కాలేజీ మీదుగా తదితర ప్రాంతాల్లోని పలురోడ్లు, వీధుల్లోని కంటైన్​మెంట్​ జోన్లలో లాక్ డౌన్ పరిస్థితిని కాన్వాయ్ లో కలియ […]

Read More

ఉత్తరాఖండ్​లోనూ వీకెండ్​ లాక్​డౌన్​

డెహ్రాడూన్​: కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. నాలుగు జిల్లాల్లో శని, ఆదివారాల్లో లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న డెహ్రాడూన్, హరిద్వార్​, ఉధమ్​సింగ్​ నగర్​, నైనిటాల్​లో లాక్​డౌన్​ కొనసాగనున్నది. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి, వ్యవసాయపనులకు, నిర్మాణరంగ పనులకు మినహాయింపు ఇచ్చారు. మద్యం దుకాణాలు, హోటల్లు తెరుచుకోవచ్చు. అయితే మిగతా ప్రైవేట్​ కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్​ మాల్స్​ మూసేయాల్సిందే. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు […]

Read More

కోవిడ్​ సెంటర్​లో లైంగికదాడి

ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్​ సెంటర్​లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్​ సెంటర్​లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్​గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్​ సెంటర్​లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More
కరోనాపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: భారత్​లో కరోనా సామాజికవ్యాప్తి మొదలైందని కేరళ సీఎం పినరయి విజయన్​ పేర్కొన్నారు. మనదేశంలో మొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. అక్కడిప్రభుత్వం లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడంతో వ్యాధి అంతగా విస్తరించలేదు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల వెల్లువెత్తాయి. భారత్​లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం సామాజికవ్యాప్తి జరిగిందని చెప్పలేదు. దీంతో విజయన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. […]

Read More
దేశంలో విజృంభిస్తున్న కరోనా

కరోనా విజృంభణ

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతున్నది. కొత్తగా 34,000 కొత్తకేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 10,38,716 లకు చేరుకున్నది. కాగా ఇప్పటికే 26,273 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా పట్టణప్రాంతాలతోపాటు గ్రామాలకు ఈ మహమ్మారి విస్తరించింది. రానున్నరోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6,53,750 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. ప్రభుత్వాలు చేతులెత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

నాగర్​కర్నూల్​ జిల్లాలో 33 కొత్త కేసులు

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: జీహెచ్ఎంసీకి పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి మారుమూల పల్లెలకు పాకుతున్నది. శుక్రవారం ఒక్కరోజే నాగర్​కర్నూల్​ జిల్లాలో 33 కొత్తకేసులు నమోదయ్యాయని డీఎంహెచ్​వో సుధాకర్​లాల్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ పట్టణంలో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఎస్​బీఐలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి, సంతబజార్​కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. వీరితో పాటు అచ్చంపేట పట్టణానికి చెందిన 15 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. లింగాల మండలం అంబటి పల్లిలో ముగ్గురికి కరోనా సోకింది. […]

Read More
తెలంగాణలో 1,478 కరోనా కేసులు

తెలంగాణలో 1,478 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో 1,478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తంగా 42,496 కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధి బారినపడి ఇప్పటివరకు 27,296 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 403 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 13,389 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 806, రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్​82, సంగారెడ్డి 18, […]

Read More

కరోనా@ 1 మిలియన్​

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ దాటింది. 24 గంటల్లో 36,247 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,004,652కి చేరింది. ఒక్క రోజులో 690 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 25,594కి చేరింది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవ్వడం ఇదే. 10లక్షల కేసుల్లో 3,43,268 యాక్టివ్‌ కేసులు కాగా.. 6,35,790 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అమెరికాలో 3,648,250 […]

Read More