న్యూఢిల్లీ: ఇప్పుడున్న భారత్ జట్టు ఇలా తయారు కావడానికి బీజాలు నాటింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీయేనని ఇంగ్లండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్ అన్నాడు. దాదా హయాంలోనే భారత క్రికెట్లో విప్లవం మొదలైందన్నాడు. కాలక్రమంలో ఆ విప్లవమే.. భారత్‌ను క్రికెటింగ్ పవర్ హౌస్‌గా మార్చేసిందన్నాడు. ‘భారత జట్టులో భావోద్వేగాలను, ఉద్రేకాలను తీసుకొచ్చిన వ్యక్తి గంగూలీ. సారథిగా, ప్లేయర్గా, సహచరుడిగా క్రికెటర్లకు అండగా నిలిచాడు. తిరుగులేని భారత్ జట్టును రూపొందించడానికి ఆనాడే బీజాలు నాటాడు. అవి ఇప్పుడు […]
ముంబై: ఓవైపు కరోనా మహమ్మారి భయపెడుతున్నా.. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. తాము ఐపీఎల్‌కు రెడీగా ఉన్నామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు లేఖ రాశాడు. అభిమానులను అనుమతించకుండా, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నాడు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని దాదా తెలిపాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ అన్ని […]
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ జొహన్నెస్ బర్గ్: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే బాగుంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఈనెలలో దిగిపోనున్న శశాంక్ మనోహర్ స్థానాన్ని దాదా భర్తీ చేయాలన్నాడు. ‘గంగూలీ అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడాడు. కాబట్టి క్రికెట్ పై ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇతర విషయాలను కూడా బాగా అర్థం చేసుకుంటాడు. అందుకే దాదాలాంటి వ్యక్తి ఐసీసీ బాధ్యతలు తీసుకుంటే అందరికీ […]