సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై సర్కారు సీరియస్ ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను సస్పెండ్ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు విచారణకు ఆదేశించిన […]
సారథి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల వ్యవహారంలో రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి జైలులో ఉన్న తొలి వెలుగు జర్నలిస్టు రఘు 13 రోజుల తర్వాత మంగళవారం నల్లగొండ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 3న మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర […]
సారథి న్యూస్, సూర్యాపేట: రెండేళ్లకు ఒకసారి జరిగే.. తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళాగా భావించే లింగమంతుల జాతరకు నగారా మోగింది. జాతర నిర్వహణపై సూర్యాపేటలోని క్యాంపు ఆఫీసులో గురువారం దేవాదాయశాఖ అధికారులు, యాదవ కులపెద్దలు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని జాతర తేదీలను ఖరారు చేశారు. వేడుక ప్రారంభానికి 15 రోజులు ముందు అంటే 2021 ఫిబ్రవరి 14న ఆదివారం దిష్టిపూజ […]
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులతో ఆదివారం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని కోరారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు కోఆర్డినేటర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇండో- చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఆమె బీఆర్ కే భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సంతోషికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొన్నిరోజుల క్రితమే ఆమెకు నియామక పత్రాన్ని […]
సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సారథిన్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కొత్తగా జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు నమోదైనట్టు సమాచారం. సూర్యాపేట జిల్లాకేంద్రంలో జమ్మిగడ్డ, అలంకార్ రోడ్, గడ్డిపల్లి, దోసపహాడ్, తిరుమలగిరి, (మాలిపురం) ప్రాంతాలతోపాటు కోదాడ, హుజూర్ నగర్ లలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మద్యం తాగిన మైకంలో సొంత బాబాయ్ లచ్చయ్య(55)ను గొడ్డలితో అన్న కొడుకు వెంకన్న నరికి చంపాడు. తీవ్రమైన రక్తపు మడుగులో లచ్చయ్య అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడు వెంకన్న పరారీలో ఉన్నాడు. ఈ దారుణఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.