సారథి, హైదరాబాద్: హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొని పలు తీర్మానాలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను కలిసి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి తమ సమస్యలను విన్నవించాలని, అన్ని జిల్లాల్లో కలెక్టర్ లకు వినతిపత్రం ఇవ్వాలని, ఆగస్టులో హైదరాబాద్ లో ఎంపీటీసీల సభ […]
సారథి, చొప్పదండి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపుమేరకు చొప్పదండి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొలిమికుంట గ్రామంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండలాధ్యక్షుడు మొగిలి మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భర్తీచేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు […]
570 టీఎంసీల నీటివాటా రాకుండా సంతకాలు సమస్యల పరిష్కారానికి ఆగస్టు 9 నుంచి పాదయాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సారథి, కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది జలాల నుంచి 570 టీఎంసీల నీటివాటా రావాల్సి ఉండగా, సీఎం కేసీఆర్, చంద్రబాబుతో కుమ్మక్కై 299 టీఎంసీల నీటివాటా కోసం సంతకాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ ఫొటోలు తగిలించుకొని […]
సారథి, వాజేడు: ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికెల వేణు మాదిగ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనునిత్యం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దళితులను ఏడేళ్లుగా మోసం చేసిన […]
సారథి, గొల్లపల్లి: దళిత సాధికారత పథకాన్ని ప్రకటించిన సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్‌నేత చిత్రపటాలకు ఎంపీపీ నక్క శంకరయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, రమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొల్లపల్లి మారంపల్లి బాబు మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి, డైరెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ జగిత్యాల మ్యాదరి లక్ష్మీ, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, నల్ల […]
సారథి, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కేంద్రంలో మొక్కలు నాటి పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి స్ఫూర్తివంతంగా నిలిచిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నడుస్తోందన్నారు. నాటిన మొక్కలను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే […]
సారథి, కొల్లాపూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజలతో కలిసి పల్లెప్రగతి కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ఇంటింటా చెత్తసేకరణ, […]
సారథి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే వెంకటేశ్వర నేత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య, మాజీ ఎంపీపీ హనుమాండ్లు, జగిత్యాల జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ మారంపల్లి బాబు, రాపల్లి సర్పంచ్ నల్ల శ్యాం, సెక్రటరీ సురమల్ల సతీష్, రత్నం, రాజయ్య మాణిక్యం, ప్రకాష్, శ్రీనివాస్, జంగిలి ఎల్లయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.