Breaking News

హరితహారం.. స్ఫూర్తిదాయకం

హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం

సారథి, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కేంద్రంలో మొక్కలు నాటి పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి స్ఫూర్తివంతంగా నిలిచిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నడుస్తోందన్నారు. నాటిన మొక్కలను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆసిఫాబాద్ జడ్పీ చైర్​పర్సన్​కోవా లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనకం యాదవ్ రావు, డీఎఫ్​వో అధికారులు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ, కెరమెరి జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.