సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకదిర గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లు రమ్య దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రేషన్ కార్డు లేని వారికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతుబంధు అధ్యక్షుడు మల్లు దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మునీర్, మండల కో ఆప్షన్ ఎం.డి మస్తాన్, మాజీ ఎంపిటిసి నరసింహులు, పంచాయతీ సెక్రటరీ మాధవి, టిఆర్ఎస్ కార్యకర్తలు రాములు, శేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు, పోలీసులు చేస్తున్న కృషి అమోఘమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి కొనియాడారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశానుసారం శనివారం మెదక్ జిల్లా కొల్చారంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సన్మానించి సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్లు అందజేశారు.
సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జయహో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులకు పండ్లు, కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఏఎస్సై శారద, జయహో మహిళా అధ్యక్షురాలు జక్కిని శ్రీలత, కానిస్టేబుల్ సుమలత, అంగన్వాడీ టీచర్లు తిరుమల, సరస్వతి, ఆశా వర్కర్ రాధ పాల్గొన్నారు.
సారథి న్యూస్, గోధావరిఖని: లాక్ డౌన్ సమయంలో గోదావరిఖని ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వంద మంది కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) నాయకులు నిత్యావసర సరుకులను గురువారం అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద రవికుమార్ మాదిగ, పల్లె బాబు మాదిగ, జిల్లా నాయకులు కన్నూరి ధర్మేందర్ మాదిగ, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్లు మాతంగి లక్ష్మణ్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, నాగర్కర్నూల్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా సోమవారం పాన్ గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, తెల్లరాళ్లపల్లిలో వంద పేదకుటుంబాలకు 25 కేజీల బియ్యం, పప్పు నూనె, ఇతర నిత్యావసర సరుకులను పార్టీ నాయకుడు రాజునాయక్ తన సొంత ఖర్చులతో సమకూర్చగా.. సోమవారం వాటిని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. వెంగళాయపల్లి, జమ్మాపూర్, బండపల్లి గ్రామాల ప్రజలకు కరోనా నివారణపై అవగాహన కల్పించారు. వారి […]
సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది, విలేకరులకు జడ్పీ చైర్ పర్సన్ సరిత ఆదివారం సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హనుమంతురెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ధర్మవరం రంగారెడ్డి, ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ సుజాత, షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఎర్రవల్లి ఎంపీటీసీ ఎల్కుర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఇంటింటికీ టీహెచ్ఆర్ (టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేస్తుందని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి లోని నాలుగో అంగన్ వాడీ కేంద్రం ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు బియ్యం, కోడిగుడ్లు, నూనె, బాలామృతం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ […]
సారథి న్యూస్, మెదక్: లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ 13వ వార్డు లో 250 కుటుంబాలకు రూ.మూడు లక్షల నగదుతో నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూప్రాన్ […]