సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈనెల 28న చరణ్ రెడ్డి తో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో పెళ్లికూతురుకు సీఎం కేసీఆర్సతీమణి కల్వకుంట్ల శోభ పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఇతర […]
సారథి న్యూస్, మహబూబాబాద్: గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. జీవో3 అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. జీవో3 అమలైతే 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయపోస్టులను వందశాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం […]
సారథి న్యూస్, ములుగు: ములుగు అంటేనే అడవులు ఉన్న ప్రాంతమని, అడవిని చూసినప్పుడు చెట్లు లేకపోవడం బాధేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉపాధి హామీ, హరితహారం పథకాలపై సమీక్షించారు. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణఆదిత్య, జడ్పీ సీఈవో పారిజాతం, జడ్పీ చైర్మన్ జగదీష్, పీవో హనుమంతు పాల్గొన్నారు.