ఒవైసీ జంక్షన్ వద్ద రూ.80 కోట్లతో నిర్మాణం లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: నగరంలోని సంతోష్ నగర్ ఒవైసీ జంక్షన్ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల కలామ్ఫ్లై ఓవర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్ వే మార్గంగా […]
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎంపీలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కనాటారు. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పార్లమెంట్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, బోర్లకుంట్ల వెంకటేష్ నేత, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, సూర్యాపేట: దేశం కోసం కల్నల్ సంతోష్‌బాబు చేసిన ప్రాణ త్యాగానికి యావత్ భారతావని సెల్యూట్ చేస్తోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో అమర జవాన్ సంతోష్ బాబు తల్లిదండ్రులు, ఇతర సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గంటకుపైగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అధికారులు కోరుతున్నారని, కానీ సూర్యాపేటలో సంతోష్ అంత్యక్రియలు జరిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారని తెలిపారు. సంతోష్ భౌతిక కాయాన్ని త్వరగా రప్పించడానికి అన్ని […]
సారథిన్యూస్, సూర్యాపేట: భారత్ – చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ భారత్-చైనా సరిహద్దులో కల్నల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం ఇరుదేశాల బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో సంతోష్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ అధికారులు సూర్యాపేటలోని ఆయన కుటుంబసభ్యులకు మరణవార్తను తెలిపారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. సంతోష్ మరణ […]