ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం కూలీల సంక్షోభం పోవాలి.. యాంత్రీకరణ పెరగాలి నాబార్డ్ చైర్మన్, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయాలని కోరారు. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను […]
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా ఘణపురం మండల కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న రైతుబజార్, మాంసం, కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ కృష్ణనాయక్, జడ్పీటీసీ సభ్యుడు సామ్యా నాయక్, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఉన్నారు.
సారథి న్యూస్, రామయంపేట: ప్రతి గ్రామంలో రైతులు వేసిన పంటలను నమోదు చేయించుకోవాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. శనివారం మండలంలోని నందిగామ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. పంట గణన ప్రక్రియ పక్కాగా ఉండాలన్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఎప్పకప్పుడు ఆన్లైన్లో అప్‌లోడ్‌చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో దివ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సంపత్, రాజగోపాల్ ఉన్నారు.
సారథి న్యూస్, తలకొండపల్లి: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఏడీఏ రాజారత్నం హెచ్చరించారు. శుక్రవారం తలకొండపల్లి అగ్రికల్చర్ ఆఫీసులో విత్తనాలు, ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన విత్తనాలనే రైతులకు విక్రయించాలని సూచించారు. కలుపు నివారణకు వాడే గ్లైకోసెల్ మందును అక్టోబర్ 30వ తేదీ వరకు అమ్మకూడదని సూచించారు. రైతన్నలు అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఈ సీజన్లో పత్తి, వరి పంటలు వేయాలన్నారు. సమావేశంలో స్థానిక ఎస్సై సురేష్ […]
సారథి న్యూస్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనగార్డెన్స్ లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట నియోజకవర్గ స్థాయి వానాకాలం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై గురువారం రైతులు, అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. లాభం వచ్చే పంటలను మాత్రమే వేయాలని రైతులను కోరారు. ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ అధికారుల సూచనలు పాటించాలని […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక అగ్రికల్చర్ ఆఫీసులో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు మొక్కజొన్న పంటను వానాకాలంలో వేయొద్దని, యాసంగిలో సాగుచేసుకోవాలన్నారు. వరి, పత్తి వాణిజ్య పంటలతోపాటు పప్పు దినుసులైన కంది, పెసర, కూరగాయలు సాగుచేయడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, […]