సారథి న్యూస్, వెల్దండ: రెక్కల కష్టం బుగ్గిపాలైంది.. పైసాపైసా పోగేసి దాచుకున్న సొత్తు అగ్గిపాలైంది.. తాము నమ్ముకున్న కిరాణాషాపునకు మంటలు అంటుకోవడంతో బతుకంతా రోడ్డున పడినట్లయింది. నాగర్కర్నూల్జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన కొప్పు మల్లేష్, రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఊరిలోనే డబ్బాలో చిన్నపాటి కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకుని.. అందులో చికెన్, గుడ్లు, కూల్డ్రింక్స్, ఇతర నిత్యవసర సరుకులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రమాదవశాత్తు బుధవారం అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి షాపు […]
సారథి న్యూస్, వెల్దండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా ఇటీవల నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయ సంబంధిత విషయాలను చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాల్లో షురూ అయ్యాయి. ఒకటి రెండు గ్రామాల్లో ఇప్పటికే పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాయి. […]
సారథి న్యూస్, వెల్దండ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులు సూచించారు. గ్రామాల్లో పాత మట్టిమిద్దెల్లో నివాసం ఉంటున్నవారు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా సురక్షిత నివాస ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలకు గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత వీఆర్వో, వీఆర్ఏలకు తెలియజేయాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారని స్పష్టంచేశారు. ఇళ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారు ప్రభుత్వ […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ గురువారం శ్రీశైలం– హైదరాబాద్ హైవేపై ఉన్న వెల్దండ తహసీల్దార్ ఆఫీసును ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ సైదులుతో మాట్లాడారు. ఆఫీసు చుట్టూ పచ్చదనం వెల్లివెరిసేలా నాటించిన మొక్కలను చూసి కలెక్టర్ ముగ్ధులయ్యారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తహసీల్దార్ ఆఫీసు ఆవరణ పచ్చదనంతో పరిఢవిల్లడం ఎంతో అభినందనీయమని అభినందించారు. కార్యాలయ ఆవరణలో రాళ్లగుట్టపై ఖాళీగా ఉన్న స్థలంలో పూలతీగ మొక్కలను పెంచాలని కలెక్టర్ […]
సారథి న్యూస్, వెల్దండ : కాటుకు బలైపోయినటువంటి జర్నలిస్టు మనోజ్ మరణం చాలా బాధాకమని, మనోజ్ మరణానికి కారణమైన మీడియా యాజమాన్యం,ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కొప్పుల చందు గౌడ్ తెలిపారు. కరోన కాటుకు బలైన జర్నలిస్టు మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం,మీడియా యాజమాన్యం ఆదుకోవాలని అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,రూ.50 లక్షల ఎక్సగ్రెసియో ప్రకటించాలని బీసీ విద్యార్థి సంఘం నుండి రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను హామీ ఎంపీడీవో వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఉప్పు అపర్ణ తిరుమల రావు గురువారం ప్రారంభించారు. సామాజిక దూరం పాటిస్తూనే పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు నాయక్, గ్రామ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.