వాక్సిన్ తీసుకున్న ఇద్దరు వలంటీర్లు నిమ్స్ నుంచి డిశ్చార్జ్ తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’పై ప్రయోగాలు సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ హుమన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’పై హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. సోమవారం నిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు వలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత మరోసారి నిమ్స్ ఆస్పత్రిలో రక్త నమూనాలను సేకరించి […]
న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించేందుకు వలంటీర్లు కావాలని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటించింది. సోమవారం నుంచి క్లినికల్ ట్రయల్స్ షురూ చేసేందుకు పర్మిషన్ వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవాలని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎయిస్ ఎథిక్స్ కమిటీ ఒప్పుకోవడంతో ఈ ప్రకటన రిలీజ్ చేశారు. మొదటి ఫేజ్‌లో 375 మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించాల్సి ఉండగా, […]
సారథి న్యూస్, అమరావతి: రాష్ట్రంలో అక్రమమద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు సకాలంలో సేవలందించేందుకు వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే వలంటీర్లపై కఠినచర్యలు తీసుకుంటామని.. వారికి అపరాధ రుసుము వేసే విషయంపై అధికారులతో […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్సార్ పింఛన్ కానుక కింద శ్రీకాకుళం జిల్లాలో రూ.87.38 కోట్లు పంపిణీ చేశామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు ఏ.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 3,65,334 మందికి రూ.87.38 కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినట్లు తెలిపారు.
సారథి న్యూస్, శ్రీకాళహస్తి: కేవలం 80 వేల జనాభా ఉన్న చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఏకంగా 40కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధం చేశారు. పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయ టకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉదయం […]