సామాజిక సారథి, రామాయంపేట: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలను బుధవారం నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నికులాలకు కేటాయిస్తున్న సంక్షేమ పథకాలను గౌడ కులస్తులు కూడా కేటాయించాలని కోరారు. అలాగే దళితబంధు మాదిరిగా గౌడబంధు కూడా ప్రకటించాలని, గౌడ కులస్తులకు సబ్సిడీపై మోటారు సైకిళ్లను కేటాయించాలని వారు కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు […]
పలువురికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి భరోసా సామాజిక సారథి, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఇటీవల మరణించిన పిట్ల సత్యం ఇంటికి రూ.1.5 లక్షల వ్యయంతో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మరమ్మతు చేయించారు. ఎమ్మెల్సీ సందర్శించి అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. సత్యం పిల్లల ఉన్నత చదువుల పూర్తి బాధ్యతను తాను తీసుకుంటున్నానని ప్రకటించారు. వారికి […]
సారథి, రామయంపేట: ఉమ్మడి రామయంపేట మండలంలోని పలు గ్రామాల్లో 2018 నుంచి 2021 వరకు జరిగిన రూ 8 కోట్ల 76 లక్షల ఉపాధిహామీ పనుల రికార్డులను శుక్రవారం నిజాంపేట మండలకేంద్రంలో ఆడిట్చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ ఆడిట్ జూలై 16 నుంచి 30 వరకు జరిగిందని దీనిలో భాగంగా మాస్టర్స్ వేరిఫికేషన్, ఎంబీ రికార్డ్స్ వేరిఫికేషన్, కూలీలకు సక్రమంగా పేమెంట్స్ జరుగుతున్నాయా లేదా? అనే అంశాలపై రిప్రజెంట్ చేశారని ఆయన తెలిపారు. […]
సారథి, రామాయంపేట: బోదవ్యాధి నివారణకు గురువారం రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో డాక్టర్లు మాత్రలు పంపిణీ చేశారు. భోజనం తర్వాత వాటిని వేసుకోవాలని సెంట్రల్ అబ్జర్వర్ డాక్టర్ రవీంద్ర, కుమారస్వామి, జిల్లా మలేరియా ఆఫీసర్ సూచించారు. కార్యక్రమంలో ధర్మారం పీహెచ్సీ డాక్టర్ ఎలిజబెత్ రాణి, హెచ్ఈవో రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు, వలంటీర్లు పాల్గొన్నారు.
సారథి, రామాయంపేట: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. సంతోషాల మధ్య శుభకార్యం జరగాల్సిన ఆ ఇంటిలో చావు డప్పు మోగింది. పుస్తెమట్టెలను తీసుకొచ్చేందుకు వెళ్లిన పెళ్లికొడుకు తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం.. పులిమామిడి గ్రామానికి చెందిన మందపురం రాజయ్య(55) చిన్నకుమారుడు గణేష్ వివాహం నగరం గ్రామంలో జరగాల్సి ఉంది. పులిమామిడి నుంచి రామాయంపేటకు వచ్చి పుస్తెమట్టెలు […]
సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా రామాయంపేటలో ఆదివారం సాయంత్రం 8బ్రహ్మకమలాలు వికసించాయి. ఈ పూలను దర్శించిన వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మెదక్ జిల్లా రామాయంపేట 9వ వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజుకు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఈ కమలాలు వికసించి కనువిందు చేశాయి. బ్రహ్మకమలం శివుడికి అత్యంత ప్రీతికరమైంది. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తుంటారు. అందులో భాగంగా రామాయంపేటకు చెందిన […]
సారథి, రామాయంపేట: గ్రామాల్లో వర్షాకాలంలో డయేరియా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం ఆమె మండలంలోని జెడ్ చెర్వు గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్లెప్రగతి ప్రోగ్రామ్ ద్వారా సీఎం కేసీఆర్ గ్రామాలను బాగుచేయడం కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు. యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమచేస్తున్నదని […]
సారథి, రామాయంపేట: భూమి కోసం భార్యతో కలిసి కొడుకు వేధించడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం మెదక్జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో వెలుగుచూసింది. నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ కథనం.. గ్రామానికి చెందిన కట్ట నర్సయ్య(65) తన పేరున ఉన్న 2.10 ఎకరాల భూమిలో పెద్దకొడుకు నర్సింలు భార్య సంపూర్ణపై 20 గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడు. ఈ క్రమంలో చిన్నకొడుకు శ్రీనివాస్ తన తండ్రిని నమ్మించి తన భార్య పేరు మీద […]