Breaking News

ములుగు

వాజేడు ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు

వాజేడు ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చేరేందుకు ఐదవ విడత అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు జనవరి 19వ తేదీలోపు వెబ్​సైట్​ http://iti.telangana.gov.in లో అడ్మిషన్ పొందాలని సూచించారు. మొదటి నాలుగు విడతల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదివరకే జరిగిన నాలుగు విడతల్లో సర్టిఫికెట్​వెరిఫికేషన్​కాని విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి […]

Read More
అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా పరిధిలోని పస్రా అటవీ రేంజ్ పరిధిలోని వెంకటాపూర్ సెక్షన్ ఎల్లారెడ్డిపల్లి వెస్ట్ బీట్ 200 హెక్టార్లలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్(కంపా) ఆఫీసర్​ లోకేష్ జైస్వాల్, వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్ గురువారం పరిశీలించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటో ప్రజంటేషన్ గ్యాలరీని ఏర్పాటుచేశారు. స్థానిక అటవీశాఖ అధికారులు పునరుద్ధరణ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణకు చర్యలు […]

Read More
ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి

ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, ములుగు: ప్రజావిజ్ఞప్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముగులు జిల్లా అడిషనల్​కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ–ఫైలింగ్ ద్వారా ప్రభుత్వ కార్యాకలాపాలు నిర్వహించాలని సూచించారు. ప్రజావాణికి అధికారులంతా తప్పనిసరిగా నివేదికలతో రావాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,842 విజ్ఞప్తులు రాగా, 1,335 పరిష్కరించినట్లు వివరించారు. పల్లెప్రగతి పనులు వెంటవెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో […]

Read More
టీచర్ల మహాధర్నా సక్సెస్​

టీచర్ల మహాధర్నా సక్సెస్​

సారథి న్యూస్, ములుగు: విద్యారంగ సమస్యలపై హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జాక్టో, యూఎస్​పీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైందని ములుగు జిల్లా జాక్టో చైర్మన్ ఏళ్ల మధుసూదన్ తెలిపారు. కార్యక్రమానికి ములుగు జిల్లాలోని 9 మండలాల నుంచి తరలివెళ్లినట్లు తెలిపారు. ధర్నాలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం కృష్ణయ్య, ఎస్టీయూ ములుగు మండలాధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, వెంకటాపూర్ అధ్యక్షుడు బండారి జగదీశ్, రామారావు, రమణయ్య, శేషాచలం, గోవర్ధన్, భాస్కర్, మంగపేట […]

Read More
అధికారుల బెదిరింపులు మానుకోవాలి

అధికారుల బెదిరింపులు మానుకోవాలి

సారథి న్యూస్, వెంకటాపురం: ఏజెన్సీలో భుక్తి కోసం, న్యాయబద్ధంగా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ నిరసన వ్యక్తంచేస్తున్న ఆదివాసీలను దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడడం సరికాదని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి పూనేం చంటి అన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తూ గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు […]

Read More
క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్యసారథి న్యూస్​, ములుగు: క్రిస్మస్ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవులకు ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టుక ప్రపంచానికే ఓ శుభసూచికమని, ఆయన జననం ఓ సంచలనం అని కొనియాడారు. క్రీస్తు మానవాళిపై చూపిన ప్రేమ, దయ, కృప, శాంతి ప్రజలంతా ఆచరించదగినవని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా నుంచి మనల్ని విముక్తి చేసేలా క్రైస్తవులు ప్రార్థనలు చేయాలని […]

Read More
విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

సారథి న్యూస్, ములుగు: కరోనా సెకండ్​ వేవ్​ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని 15 రోజుల వరకు క్వారంటైన్​లో ఉంచాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణాఆదిత్య సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ములుగు, భూపాలపల్లి జిల్లాల వైద్యాశాఖ అధికారులతో కోవిడ్ -19 వాక్సిన్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. పీహెచ్​సీల్లో […]

Read More
మావోయిస్ట్ కీలక నేత కోసం పోలీసుల వేట

మావోయిస్ట్ కీలక నేత కోసం పోలీసుల వేట

సారథి న్యూస్​, ములుగు: మావోయిస్టు కీలకనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్(40) తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారన్న పక్కా సమాచారంతో ములుగు జిల్లా పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. జిల్లాలోని అడవిని జల్లెడ పడుతున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ, గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. కొత్త వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. మావోయిస్టు కీలక నేత దామోదర్​ను పట్టిచ్చిన వారికి రూ.రెండులక్షల బహుమతిని కూడా ఇస్తామమని పోలీస్ శాఖ ప్రకటన […]

Read More