సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఎస్సీలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయని విమర్శించారు. శనివారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం ఒక ఆర్డినెన్స్ ను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేశారా? ప్రజలకు చెప్పాలని […]