సారథి న్యూస్, కర్నూలు: రెండు నెలల్లో కర్నూలు, ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభమవుతాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా ఎయిర్ పోర్ట్ ను అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని వివరించారు. పెండింగ్ ఉన్న 17 రకాల పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని సూచించారు. […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాతో పాటు ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గతేడాది ఫ్లాష్ ఫ్లడ్స్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, సుంకేసుల, గాజులదిన్నె డ్యాములు, వెలుగోడు, గోరకల్లు, పోతిరెడ్డిపాడు, అవుకు, కృష్ణగిరి, పందికోన హంద్రీ రిజర్వాయర్లు, తుంగభద్ర, […]
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండోదఫా 2020–21 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను రూపొందించింది. మంగళవారం అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శానసమండలిలో డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లుగా ప్రకటించారు. బీసీ సంక్షేమానికి గతేడాది కంటే 270 శాతం అదనంగా కేటాయించాయి. వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,419.44 […]