సారథి న్యూస్, హైదరాబాద్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత(డిసెంబర్ 2018)లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎత్తుకున్న ఫెడరల్ ఫ్రంట్ నినాదం.. ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. నిధులు, అధికారాల విషయంలో అప్పట్లో కేంద్రంపై విమర్శలు గుప్పించిన సీఎం.. ఆ తర్వాత నుంచి మిన్న కుండిపోతున్నారు. అడపాదడపా ప్రధాని మోడీ సర్కారు తీరుపై దండెత్తినట్టు వ్యవహరిస్తున్నా.. అవన్నీ ప్రెస్మీట్లు, మాటలకే పరిమితమవుతున్నాయే తప్ప ఆచరణలో కనిపించడం లేదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. కరోనా విజృంభణ, ఫలితంగా లాక్డౌన్, […]
న్యూఢిల్లీ: నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైద్యులు, ఇతర సిబ్బందికి విషెష్ చెప్పారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో డాక్టర్లదే కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. వారి జీవితాల్ని పణంగాపెట్టి మనల్ని కాపాడుతున్నారని చెప్పారు. ‘తల్లి బిడ్డకు జన్మనిస్తే..అదే బిడ్డకు వైద్యులు పునర్జన్మని ఇస్తారు” అని అన్నారు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్‌డే పురస్కరించుకుని దేశంలోని సీఏలందరికి మోడీ విషెస్ చెప్పారు. దేశ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తు సీఏల చేతిలోనే ఉందంటూ వారి బాధ్యతను […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. కోవిడ్ – 19 ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యను హైలైట్ చేయడం ద్వారా ప్రజల్లోని భయాందోళనను పారదోలాలని ప్రధాని సూచించారు. బుధవారం రెండవ రోజు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆన్ లాక్ 1.0 అనంతర పరిస్థితులపై ప్రధాని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. మంగళవారం కట్కూర్ గ్రామంలో మోడీ పాలనపై ఇంటింటా ప్రచారంలో మాట్లాడారు. దేశంలో సుదీర్ఘంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారని చెప్పారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్తీక్, రాహుల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఈ నెల 28న జరిగే మన్ కీ బాత్‌లో మాట్లాడేందుకు ఐడియాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. తమ ఐడీయాలను నమో యాప్‌లో, మై జీవోవీ ఓపెన్ ఫోరంలో లేదా1800-11-7800 నంబర్ ద్వారా రికార్డ్ చేయాలని మోడీ ట్వీట్ చేశారు. ‘ఈ నెల 28న మన్ కీ బాత్ జరుగుతుంది. రెండు వారాలు ఉన్నప్పటికీ దయచేసి మీ ఆలోచనలు ఇవ్వండి. కరోనాతో పోరాడడం, దాని కంటే ఇంకా ఎక్కువ మీరు చెప్పాల్సింది కచ్చితంగా […]
ప్రజలు ఇప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలని సూచన మిడతల దాడితో నష్టపోయిన వారిని ఆదుకుంటాం న్యూఢిల్లీ: కరోనాతో పోరాడుతున్న సమయంలో ప్రపంచం మొత్తానికి యోగా, ఆయుర్వేద సామర్థ్యం తెలిసొచ్చిందని మోడీ చెప్పారు. ‘కరోనా వైరస్ సంక్షోభంలో ప్రపంచంలోని చాలా మంది లీడర్లతో మాట్లాడాను. వాళ్లంతా ఆయుర్వేదం, యోగాపై ఇంట్రెస్ట్ చూపించారు. ఈ టైంలో యోగా, ఆయుర్వేదం ఎలా ఉపయోగపడిందో తెలుసుకున్నారు. ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. హాలీవుడ్ నుంచి హరిద్వార్ వరకు ప్రతి ఒక్కరు యోగాను నేర్చుకున్నారు’ […]
ఆఫ్రిదిపై టీమిండియా స్టార్ క్రికెటర్ల ఫైర్ న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాశ్మీర్‌ను వదిలేసి.. అన్నింటిలో విఫలమైన నీ దేశానికి పనికొచ్చే పని చేయ్. కశ్మీర్.. భారత్‌లో భాగంగా ఉన్నందుకు గర్వపడుతున్నా’ అంటూ సురేశ్ రైనా ధ్వజమెత్తాడు. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని యువరాజ్ పేర్కొన్నాడు. ‘బాధ్యాతయుతమైన భారతీయుడిగా, దేశం […]