సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఆరేళ్ల సర్వీస్ఉండగానే తన అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగప్రవేశం చేశారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. అన్నివర్గాలను సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆటోడ్రైవర్లు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా అందరి బాధసాధకాలను తెలుసుకుంటున్నారు. వారందరినీ పేదరికంలో పెట్టివేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. 70 ఏళ్లలో అన్ని వర్గాలు అభివృద్ధికి దూరమైన తీరును గుర్తుచేస్తూనే.. బహుజన రాజ్యం ఆవశ్యకతను వివరిస్తున్నారు. తాజాగా […]
సారథి, అచ్చంపేట: దేశంలో ఉన్న అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం గొప్ప నిర్ణయమని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాఘవేందర్ కొనియాడారు. ఇప్పటి వరకు కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 18ఏళ్లు పైబడిన వాళ్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలన్న నిర్ణయం చూస్తుంటే కరోనా నుంచి దేశప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యమన్నారు. అంతే కాకుండా దీపావళి(నవంబర్) వరకు దేశంలో గరీబ్ కళ్యాణ్ […]
సారథి, చొప్పదండి: సాహసోపేతమైన నిర్ణయాలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న నరేంద్రమోడీ దేశం గర్వించదగిన ప్రధాని అని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ కొనియాడారు. ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చొప్పదండి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో పలు వార్డుల్లోని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, మాస్క్ లు, సానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చొప్పదండి పట్టణ ప్రధాన కార్యదర్శులు బత్తిని […]
సారథి, జగిత్యాల రూరల్: నరేంద్రమోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదేశాల మేరకు కొవిడ్ పేషెంట్లకు పండ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల రూరల్ మండల ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి రాజిరెడ్డి, రురల్ మండల కోశాధికారి మెడపట్ల లక్ష్మణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పడిగెల మహిపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు వంగ మధుకర్ రెడ్డి, […]
సారథి, రామడుగు: చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ మండల స్థాయి శిక్షణ తరగతులు దేశరాజుపల్లి గ్రామంలోని జయశ్రీ గార్డెన్ శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు బీజేపీ జిల్లా స్థాయి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హాజరయ్యారు. బీజేపీ ఆవిర్భావం, వికాసం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి కార్యకర్తలకు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మేకల ప్రభకర్ యాదవ్, మండలాధ్యక్షుడు ఒంటెల […]
న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి జరిగి ఆదివారంతో 19 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో నాటి ముష్కరుల దుశ్చర్యను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పార్లమెంట్‌పై దుండగుల దాడిని ఎప్పటికీ మరువలేమన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్‌చేశారు.2001 డిసెంబర్13న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడి చేశారు. వారిని భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్మహిళతో పాటు ఇద్దరు పార్లమెంట్ […]
త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ 70వ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో బర్త్ డే వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉదయమే రజనీ అభిమాన సంఘం (మక్కల్ మన్రం) సభ్యులు బ్యానర్లు కట్టి, రజనీకాంత్ ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి సందడి చేశారు. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విషెస్ చెబుతూ […]
సారథి న్యూస్, మానవపాడు: నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులకు దోచిపెట్టేందుకు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత్బంద్కార్యక్రమంలో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బెంగళూరు– హైదరాబాద్ హైవేను అఖిలపక్ష నాయకులతో కలిసి దిగ్బంధించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు సంబంధించిన మొండిబకాయిలను రద్దుచేసిందన్నారు. నూతన వ్యవసాయ చట్టంలో […]