సారథిన్యూస్, రామడుగు: భారత్, చైనా సరిహద్దులో మృతిచెందిన అమరజవాన్లకు కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా రామడుగులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘అమరవీరులకు సలామ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు పంజల శ్రీనివాస్ గౌడ్, నీలం దేవకిషన్, బాపిరాజు, మన్నే సహృదయ్, మాణిక్యం, […]
సారథిన్యూస్, చొప్పదండి / ఖమ్మం: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళి […]
సారథి న్యూస్, రామడుగు/ఖమ్మం: చైనా శత్రు మూకల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు రామడుగులోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యావంతులవేదిక ఆధ్వర్యంలో గురువారం కొవ్వత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళి అర్పించారు.
సారథి న్యూస్, గోదావరిఖని: స్వర్గీయ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మహిళా కాంగ్రెస్ రామగుండం అధ్యక్షురాలు, కార్పొరేటర్ గాధం విజయానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను కొనియాడారు.