Breaking News

నిరుద్యోగ భృతి

నిరుద్యోగ భృతి ప్రకటించాలి

నిరుద్యోగ భృతి ప్రకటించాలి

సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరుద్యోగ భృతి ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. సోమవారం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి.సంపత్, కల్లేపల్లి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్​ను విడుదల చేయకపోతే […]

Read More
నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష

నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష

సారథి న్యూస్, అయిజ(మానవపాడు): నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్​ఓబీసీ సెల్​రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి తెలిపారు. సోమవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్​ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్​ఉద్యోగులంతా తిండి తిప్పలు మాని ఇబ్బందులు పడుతుంటే, కూటికి గడవక కూలికిపోతుంటే చోద్యంచూసిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల రాగానే […]

Read More
టీఎస్​పీఎస్​ఆఫీసు ముట్టడి

టీఎస్​పీఎస్సీ ​ఆఫీసు ముట్టడి

​సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వాస్తవ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ ​చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా యూత్​ కాంగ్రెస్​రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని జనవరి 28న మంత్రి కేటీఆర్​ప్రకటించి విధివిధానాలను విడుదల చేయలేదని, 1.32లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని అబద్ధపు మాటలు చెబుతూ యువతను […]

Read More
త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ

త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ

సారథి న్యూస్, హైదరాబాద్​: రాష్ట్రంలో త్వరలోనే మరో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నామని మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే 1.31లక్షల ఉద్యోగాలను భర్తీచేశామన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్ ​సమస్య లేదన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. దేశంలోనే పారిశ్రామిక రంగానికి సరిపడా కరెంట్​ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సమావేశంలో […]

Read More

నిరుద్యోగ భృతి ఇవ్వండి

సారథి న్యూస్, రామడుగు: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కరీంనగర్ పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగి శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్​ కలెక్టర్ కె.శశాంకకు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలుచేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఈ కష్టసమయంలో వారందరికీ రూ.3,016 ఇవ్వాలని కోరారు.

Read More