Breaking News

నాగర్ కర్నూల్

బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి

బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి

సారథి, నాగర్​కర్నూల్: ముస్లింల పవిత్ర బక్రీద్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం పండుగ కావడంతో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురిస్తే నమాజ్​కు ఇబ్బందులు తలెత్తకుండా మసీదుల్లోనే ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లుచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈద్గాకు పెయింటింగ్ వేయించడంతో పాటు ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించారు. స్టోన్​డస్ట్​పోసి బురదను సరిచేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జామా మసీద్​ను […]

Read More
మంగనూర్​ను మండలం చేయండి

మంగనూర్​ను మండలం చేయండి

సారథి, బిజినేపల్లి: రాష్ట్రంలోనే పెద్దమండలంగా ఉన్న నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం నుంచి మంగనూర్​ను వేరుచేసి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు, జిల్లా ప్లానింగ్​కమిటీ మాజీ సభ్యుడు, న్యాయవాది సి.పరశురాములు జిల్లా కలెక్టర్​ఎల్.శర్మన్​ను కోరారు. మంగనూర్​శ్రీశైలం– రాయిచూర్​ హైవేపై ఉన్నదని, చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉందని తెలిపారు. అధిక జనాభా కలిగిన మండలాన్ని రెండు మండలాలుగా చేస్తే ప్రజలకు పాలన చేరువుతుందని, అధికారులకు విధులు మరింత సులువు అవుతాయని వివరించారు. మండలంలో లక్ష […]

Read More
పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని పెంటోనిచెరువు తూము నుంచి రైతులకు చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టులో పంటలు సాగుచేసేందుకు వీలుగా సర్పంచ్ గోవింద్ లావణ్య నాగరాజు, ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ సోమవారం నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో చెరువులను నీటితో నింపిన ఘనత టీఆర్ఎస్​ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు పంటలు పండించడానికి వీలుగా నీటి వసతి కల్పించిన నాగర్ […]

Read More
‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం రాజాపురంలో 8మంది యువకులు గ్రామంలో చీకటిపడగానే మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ, వాహనదారులు, బాటసారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘మేము దండుపాలెం బ్యాచ్ రా.. శవాలను లేపుతాం […]

Read More
అడవుల సంరక్షణ అందరి బాధ్యత

అడవుల రక్షణ అందరి బాధ్యత

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మియావాకి ప్లాంటేషన్ ను శుక్రవారం కలెక్టర్ ఎల్.శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను పెంచేలా జపాన్‌ మియావాకీ పద్ధతిలో నాటడం ద్వారా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానంతో ప్రతి పట్టణ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో నాటి చిట్టడవులను […]

Read More
విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గురువారం అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 200 మంది విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులు అందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ప్రభుత్వం విస్మరించిందని, పాఠశాలలు తెరుచుకోకపోవడంతో 14 నెలలుగా […]

Read More
లానికి వెళ్లే దారిని మూసివేశారని..

పొలానికి వెళ్లే దారిని మూసివేశారని..

మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నం సారథి, కొల్లాపూర్: తమ పొలానికి వెళ్లే దారిని మూసివేశారని మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనంపల్లిలో కలకలం రేపింది. బాధితులు, గ్రామస్తుల కథనం.. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సాలమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పొలానికి వెళ్తున్న దారిని పల్లెప్రకృతి వనాన్ని నిర్మించేందుకు గాను మూసివేశారు. దారి లేకపోవడంతో రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్, పంచాయతీ […]

Read More
విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు సారథి, కొల్లాపూర్: రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడ్డ విద్యా వలంటీర్లకు అండగా ఉంటామని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు భరోసా ఇచ్చారు. నాగ్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గురువారం జరిగిన ‘దగాపడ్డ విద్యావలంటీర్లకు చేయూత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో వారి బతుకులు చితికిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారి న్యాయమైన డిమాండ్ల […]

Read More