సామాజిక సారథి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూజాహెగ్డే స్వీకరించి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూజాహెగ్డే మొక్కలు నాటిన అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ […]
గతేడాది విడుదలైన ‘ఖైదీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. విభిన్నకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కార్తీ హీరో నటించగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా.. కత్రీనాను హీరోయిన్గా ఎంపికచేశారట. వాస్తవానికి తమిళ మాతృకలో హీరోయిన్ పాత్ర ఉండదు. హిందీలో కొన్ని మార్పులు చేసి హీరోయిన్ పాత్రను యాడ్చేసినట్టు సమాచారం. […]
మెగాబ్రదర్ నాగబాబు కూతురు, నటి నిహారిక.. ఎంగేజ్మెంట్ గురువారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో నిరాడంబరంగా జరిగింది. గుంటూరు ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. కాగా, కేవలం కొంతమంది అతిథులు మధ్య ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా తెలుగులోకి […]
అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్ఎస్టేట్ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్ విద్యానగర్‌లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]