సారథి, పెద్దశంకరంపేట: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తీసుకున్న విత్తనాలను పరిశీలించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నాసిరకం విత్తనాలను అంటగడితే తమకు సమాచార ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, రైతులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సారథి, రామాయంపేట: ఈ వానాకాలం సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ఎవరైనా సీడ్ షాప్ ఓనర్లు నకిలీ సీడ్స్ ను రైతులకు అంటగడితే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీచేసి స్టాక్ రిజిస్టర్, ధరల పట్టిక, బిల్లు బుక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే సంకల్పంతో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో గురువారం ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. రైతులను ఎవరైనా నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుల మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై గ్రామాల్లో పోలీసుల నిఘా ఉంటుందని. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలుచేసి రికార్డులు పొందాలన్నారు. తనిఖీల్లో వేములవాడ డీఎస్పీతో పాటు […]
సారథి, చొప్పదండి: రైతులకు వానాకాలం సీజన్ నేపథ్యంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ హెచ్చరించారు. సోమవారం ఆయన చొప్పదండి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లలో ఏఈవోల కృషిని అభినందించారు. ప్రైవేట్ వ్యక్తులు రైతులకు విత్తనాలు ఇచ్చి ధాన్యం కొనకుండా వదిలేసి ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, […]
– సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సారథి న్యూస్, గోదావరిఖని: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వానాకాలంలో నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. వ్యవసాయరంగ సంబంధిత అంశాలపై శనివారం ఆయన కలెక్టర్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్టీపీసీ మిలీనియం హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వానాకాలం పత్తి, […]