ఎమ్మెల్యే సొంత మండలంలోనే అంబులెన్స్ సౌకర్యం లేదు బహుజన రాజ్యంలో విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సామాజికసారథి, తిమ్మాజిపేట: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సొంత మండలమైన తిమ్మాజిపేటలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 […]
సామాజిక సారథి, తిమ్మాజీపేట: మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఉన్న కాలం చెల్లిన మద్యాన్ని సోమవారం అధికారులు పార బోయించారు. దాదాపుగా 243లిక్కర్ కేసులు కాలం చెల్లింది. వీటిని మద్యం ప్రియులు సేవించకుండా పోయింది. దీనితో మద్యం డిపో మేనేజర్ లచ్చయ్య నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎస్ఐ అనుదీప్ సమక్షంలో కాలం చెల్లిన మధ్యాన్ని హమాలీలతో పరబోయించారు. వీటి విలువ దాదాపుగా రూ.12లక్షల దాకా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు.
సామాజిక సారథి, తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని చేగుంట గ్రామంలో శనివారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉట్టికొట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి. సర్పంచ్ బి.లావణ్య, ఎంపీటీసీ సభ్యుడు పిల్లమల్ల మల్లయ్య, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.