సారథిన్యూస్, రామడుగు: పేదరికం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. విధి వెక్కిరించింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల నా అనేవాళ్లకు దూరమై అనాథలయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం వనిత (17), గుర్రం నవీన్ కుమార్(6)ల తల్లిదండ్రులు నాలుగేండ్ల క్రితం ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో వాళ్ల నాన్నమ్మే పిల్లలిద్దరినీ పెంచి పోషించింది. సోమవారం వాళ్ల నాన్నమ్మ కూడా తుదిశ్వాస విడిచింది. దీంతో వీరు అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో […]
న్యూఢిల్లీ: చిన్న, చిన్న విషయాలకే టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రుల పిల్లలను చేరదీయకపోవడం, వారికి మానసిక స్థైర్యం కల్పించకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ బాలిక.. తనకంటే స్నేహితురాలికి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్నది. కాన్పూర్‌లోని ధమిఖేడకు చెందిన శ్రావణ్ కుమార్ కుమార్తె అనిశా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో 82 శాతం మార్కులు వచ్చాయి. కాగా తన […]