సామాజికసారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారం పంచాయతీలో బుధవారం బొడియ్యతండాకు చెందిన రాత్లావత్ బిందుకు చెన్నారం గ్రామానికి చెందిన హరిత కొండలచారి, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మంజూరైన రాత్లావత్ బిందుకు రూ.11వేలు, హరితకు రూ.14,500 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్నభాస్కర్ రెడ్డి, చుక్కపూర్ ఎంపీటీసీ నాలాపురం వందన, రైతు గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమకొండ […]
సారథి న్యూస్, తలకొండపల్లి: ప్రజాసమస్యల పరిష్కారానికి అనునిత్యం సేవలందించిన దివంగత సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలో యాదయ్య కుటుంబసభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య మృతి తనను కలచివేసిందన్నారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా తనను కలవాలని సూచించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కుటుంబసభ్యులు, […]
విజయం ఎప్పుడూ వెంటనే వరించదు. తన కోసం తపించే వారి మనసును పరీక్షిస్తుంది. అడ్డంకులను సృష్టించి, కష్టాలను కలిగిస్తుంది. అవకాశాలను చేజారుస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని, కష్టాల కన్నీటిని అదిమిపట్టి, ఎంత కష్టమొచ్చినా ఎదిరించి నిలిచిన వారికే అది వరమవుతుంది. 14 ఏళ్ల వయస్సులో బడిలో ఉండాల్సిన అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంది. 23 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఏదైనా ఉద్యోగం చేయాలనే తండ్రి కలను నెరవేర్చింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా […]
సారథిన్యూస్, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో మంగళవారం ఎమ్మార్పీఎస్ 26 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేసి కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితుల హక్కులను కాపాడేందుకు ఎమ్మార్పీఎస్ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతియ్య మాదిగ, దళితసంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దరువుల శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కృష్ణ మాదిగ, మండల […]
సారథి న్యూస్, తలకొండపల్లి: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఏడీఏ రాజారత్నం హెచ్చరించారు. శుక్రవారం తలకొండపల్లి అగ్రికల్చర్ ఆఫీసులో విత్తనాలు, ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన విత్తనాలనే రైతులకు విక్రయించాలని సూచించారు. కలుపు నివారణకు వాడే గ్లైకోసెల్ మందును అక్టోబర్ 30వ తేదీ వరకు అమ్మకూడదని సూచించారు. రైతన్నలు అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఈ సీజన్లో పత్తి, వరి పంటలు వేయాలన్నారు. సమావేశంలో స్థానిక ఎస్సై సురేష్ […]