Breaking News

టీఆర్ఎస్

కూచకుళ్ల, కసిరెడ్డి నామినేషన్లు ఓకే!

కూచకుళ్ల, కసిరెడ్డి నామినేషన్లు ఓకే!

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు నామినేషన్లు ఆమోదం పొందాయి. ఆరు తిరస్కరణకు గురయ్యాయని మహబూబ్​నగర్​జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ఎస్.వెంకట్రావు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్​నగర్ ​కలెక్టరేట్ లో ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఈ.శ్రీధర్, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు […]

Read More
దామోదర్ రెడ్డికి మొండిచేయి?

దామోదర్ రెడ్డికి మొండిచేయి?

‘మళ్లీ ఎమ్మెల్సీ’ హామీతోనే కాంగ్రెస్​ నుంచి టీఆర్ఎస్​లోకి.. టిక్కెట్ రాకపోవడంపై అనుచరవర్గంలో ఆందోళన అధిష్టానం నిర్ణయంపై వేచిచూసే ధోరణిలో కూచకుళ్ల ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నుంచి పలువురి పోటీ ఎమ్మెల్సీ కసిరెడ్డి, సాయిచంద్​కు ‘స్థానిక సంస్థల’ టికెట్​ సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్​నేత, సిట్టింగ్​ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డికి టీఆర్ఎస్​అధిష్టానం మొండిచేయి చూపింది. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే ఆయనకు ఈసారి […]

Read More
బండి సంజయ్.. గోబ్యాక్ !

బండి సంజయ్.. గోబ్యాక్ !

నల్లగొండలో టీఆర్ఎస్ కార్యకర్తల నిరసన గులాబీ, కమలం శ్రేణుల బాహాబాహీ ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి ధాన్యం కుప్పలపై పరుగులు.. చెల్లాచెదురైన వడ్లు సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్​కు చేరుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘బండి సంజయ్ […]

Read More
ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి

ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి?

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి వీఆర్​ఎస్​ తీసుకున్నారు. టీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని సీఎం కేసీఆర్ ​నుంచి గ్రీన్​సిగ్నల్​ కావడంతో ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్​ సోమేశ్​కుమార్​కు పంపించగా ఆయన ఆమోదించారు. ఇదిలాఉండగా, కొద్దిసేపటల్లో టీఆర్ఎస్​లో చేరనున్నట్లు సమాచారం. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో డిప్యూటీ కలెక్టర్ ​కేడర్​లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి […]

Read More
టీఆర్ఎస్, బీజేపీ ధర్నాలపై ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​సంచలన కామెంట్స్​

బీజేపీ, టీఆర్ఎస్ ధర్నాలపై ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​సంచలన కామెంట్స్​

సామాజిక సారథి, భువనగిరి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కలెక్టరేట్ల ముందు ధర్నాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలకు తెరతీశాయని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రోడ్లపై ధర్నాలు చేపట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెంలో ఏర్పాటుచేసిన ‘బహుజన మేలుకొలుపు’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ మాయమాటలతో కాలం […]

Read More
హుజూరాబాద్​ఓటమితో టీఆర్ఎస్ అలర్ట్

హుజూరాబాద్​ ఓటమితో టీఆర్ఎస్ అలర్ట్

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ ఉపఎన్నిక ఫ‌లితం అధికార టీఆర్ఎస్‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను తెచ్చిపెట్టింది. సీఎం కె.చంద్రశేఖర్​రావు ఈ ఎన్నిక‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ట్రబుల్ ​షూట‌ర్, మంత్రి టి.హ‌రీశ్‌రావు దీన్ని ఒక స‌వాల్‌గా తీసుకుని ప‌నిచేశారు. అయినా ఫ‌లితం తారుమారు కావడంతో వారు కొంత నైరాశ్యానికి గురైన‌ట్లు తెలిసింది. అందులోనూ 23వేల పైచిలుకు మెజారిటీతో ఈట‌ల రాజేందర్​ గెల‌వ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఉపఎన్నిక ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం పార్టీకి […]

Read More
9వ రౌండ్​లో బీజేపీనే..

9వ రౌండ్​లో బీజేపీనే..

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్​ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. 8వ రౌండ్​లో టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ దూసుకొచ్చారు. 162 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో ఈటలకు మెజార్టీ కాస్త తగ్గినట్లయింది. 9 రౌండ్ లో టీఆర్ఎస్ కు 3,470, బీజేపీకి 5,305, కాంగ్రెస్ 1349 సాధించింది. ఈ రౌండ్​లో బీజేపీ 1,835 లీడ్​ సాధించింది. 9రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ 5,111 ఓట్ల […]

Read More
రేసులోకి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​

రేసులోకి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్​ కొనసాగుతోంది. ప్రముఖంగా ఇద్దరి మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్​లో బీజేపీ 4,044 (31,027), టీఆర్ఎస్ 3,792 (27,589) ఓట్లు సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు 3,438 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ​అయితే ఉన్నట్టుండి 8వ రౌండ్​లో టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ దూసుకొచ్చారు. 8వ రౌండ్ లో 162 […]

Read More