సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: క్రమశిక్షణతో ఉంటూ స్టేషన్ కు వచ్చే బాధితులను గౌరవిస్తూ పోలీస్ శాఖకు మరింత మంచిపేరు తీసుకురావాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలని కోరారు. 9నెలల ట్రైనింగ్ అనంతరం జిల్లా పోలీసు డిపార్ట్మెంట్లో విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జమ్మిచెడులోని సీఎన్జీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ పలు సూచనలు […]
సారథి న్యూస్, మానవపాడు(అలంపూర్): తెలంగాణలోనే ప్రఖ్యాతిచెందిన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా తెప్పోత్సవం జరిగింది. ఆలయ సమీపంలోని తుంగభద్ర నదిలో హంస వాహనంపై ఆదిదంపతుల(స్వామి, అమ్మవారు) తెప్పోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించగా.. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ‘జై జోగుళాంబ, జై బాలబ్రహ్మేశ్వరా!’ అంటూ భక్తులు జయజయధ్వానాలు పలికారు. అంతకుముందు స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయాల నుంచి ఊరేగింపుగా పల్లకీలో నది వద్దకు తీసుకొచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్నందున జూరాలకు ప్రస్తుతం ఐదులక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. క్రమేణా ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. బ్యాక్ వాటర్ వల్ల ఈ దిగువ సూచించిన గ్రామాలు ప్రభావితం కావచ్చు. అందువల్ల నదీ పరివాహక గ్రామ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతిఓఝా సూచించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎన్నడూ లేని విధంగా కృష్ణానది పోటెత్తుతోంది. 2009లో కృష్ణమ్మ ఓ ప్రళయం సృష్టించింది. 2019లో రికార్డు స్థాయిలో పరవళ్లు తొక్కింది. 2020లో జూరాల మరో విధ్వంసాన్ని సృష్టించబోతుందా..? అవుననే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కన్నా ఈ సారి జూరాల ప్రాజెక్టుకు ఈ రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాలకు వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం […]
వర్షాలకు ఇంట్లో నీటి ఊట ఇబ్బందుల్లో ఓ పేద కుటుంబం సారథి న్యూస్, మానవపాడు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో గఫూర్ ఇంటిలో నీటి ఊట ఊరుతోంది. ఇంట్లో మొత్తం అడుగు మేర నీళ్లు నిలిచాయి. ఇద్దరు పిల్లలతో కంటికి కునుకులేకుండా గడుపుతున్నామని భార్యాభర్తలు వాపోయాయి. ‘ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాం. చిన్నవర్షం కురిసినా ఇంట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎవరూ మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. ఇద్దరు పిల్లలతో నరకం […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామంలో భారీవర్షానికి గ్రామానికి చెందిన బోయ నడిపి ఉషన్న ఇల్లు శనివారం రాత్రి కూలిపోయింది. సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.రెండువేలు అందజేశారు. బాధిత కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట భాస్కర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.
ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రేమికులు శ్రీశైలం, సుంకేసుల, జూరాల, అవుకుకు వెళ్లేందుకు టూరిస్టుల ఆసక్తి సారథి న్యూస్, కర్నూలు: కరోనా ముప్పు ఇప్పుడిప్పుడే తొలగిపోయినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పలువురు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా తరలివస్తుండడంతో తుంగభద్ర, కృష్ణానదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి , నారాయణ్‌పూర్ డ్యాం గేట్లు ఎత్తడంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరదనీరు ఉధృతికి […]
సారథి న్యూస్, మానవపాడు(జోగులాంబ గద్వాల జిల్లా): జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన చైర్మన్రామేశ్వరమ్మ, వైస్ చైర్మన్ గా వాకిటి సంజీవులు, 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జడ్పీవైస్ చైర్ పర్సన్ సరోజమ్మ, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, సింగిల్‌విండో చైర్మన్ సుభాన్, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, వివిధ […]