సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. శుక్రవారం1,46000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైందని అధికారులు తెలిపారు. అయితే 1,68743 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.629 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. అలాగే నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని […]
సారథిన్యూస్, చొప్పదండి: చొప్పదండి నియోజకవర్గంలోని పలు చెరువులను ఎల్లంపల్లి జలాశయం నీటితో నింపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి జలాశయ నీటితో చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్, మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్, ఫాజుల్ నగర్ చెరువు నింపాలని ఎమ్మెల్య రవిశంకర్.. సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం […]