సారథి న్యూస్, రామడుగు: ఒక్క సిరాచుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ యావత్ సమాజాన్ని మెల్కోలిపిన కాళోజీ చిరస్మరణీయుడని రామడుగు ఎస్సై అనూష పేర్కొన్నారు. కాళోజీ 107 వ జయంతి సందర్భంగా బుధవారం ఆమె కరీంనగర్ జిల్లా రామడుగులో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చొప్పదండి సీఐ రమేశ్, పోలీస్‌సిబ్బంది పాల్లొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తూ.. అవార్డులను […]
సారథి న్యూస్, ఖమ్మం, రామడుగు,చొప్పదండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి పువ్వాడ అజయ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్‌లో […]