సారథి, చొప్పదండి: కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో జనం హడలిపోతున్నారు. కరీంనగర్జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టెస్టుల కోసం జనం తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచి మొదలు కుని మధ్యాహ్నం వరకు ఎండలోనే ఉండి టెస్టులు చేయించుకోని పోతున్నారు. శుక్రవారం ఇలా కొంతమంది తమ చెప్పులు, ఇంకొంతమంది ఆధార్‌కార్డులను క్యూ లైన్ఉంచి మరీ పరీక్షలు చేయించుకుంటున్నారు. చివరికి కిట్లు లేవని వైద్యసిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కిట్ల సంఖ్య పెంచాలని […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. పట్టణంలోని షాలోమ్ చర్చిలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏ.ఎజ్రా మల్లేశం, గౌరవాధ్యక్షుడిగా గుండేటి శాంతి కుమార్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా పట్టెం అబ్రహం, ఉపాధ్యక్షుడిగా దేవదాస్, ప్రధాన కార్యదర్శిగా ప్యాట యాది ప్రకాష్, సంయుక్త సంయుక్త కార్యదర్శకులుగా గడ్డం అజయ్ కుమార్, జె.దావీద్, కోశాధికారిగా పాల్ నెల్సన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.దేవయ్య, మీడియా కన్వీనర్లుగా జాన్సన్, […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ చిలుక రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, వరి కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ఐదొందల మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నదని, ప్రజలంతా మాస్కులు ధరించి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలి. గ్రామంలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరికివారు తమ […]
సారథి, మానవపాడు/రామడుగు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం, పుల్లూరు గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరిగాయి. కరోనా చీకట్లు తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా రైతులకు సకాలంలో వర్షాలు పడుతూ అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు అభివృద్ధి చెంది నిండునూరేళ్లు అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని పుల్లూరు గ్రామ ప్రజలు పూజించారు. – కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సీతారాముల కల్యాణానికి భద్రాచలం […]
సారథి, రామడుగు: చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ మండల స్థాయి శిక్షణ తరగతులు దేశరాజుపల్లి గ్రామంలోని జయశ్రీ గార్డెన్ శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు బీజేపీ జిల్లా స్థాయి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హాజరయ్యారు. బీజేపీ ఆవిర్భావం, వికాసం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి కార్యకర్తలకు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మేకల ప్రభకర్ యాదవ్, మండలాధ్యక్షుడు ఒంటెల […]
సారథి న్యూస్, చొప్పదండి: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని రామడుగు మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్గెటి లక్ష్మణ్ ఆక్షేపించారు. స్థాయి తగ్గి మాట్లాడొద్దని హితవుపలికారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పెట్టిన భిక్షతో శోభ జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది, ఇప్పుడు టికెట్ రాకపోయే సరికి బీజేపీలో చేరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో సీఎం […]
సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో కౌండిన్య సర్వాయి పాపన్న గీత కార్మికసంఘం గ్రామ అధ్యక్షుడిగా పాకాల మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడిగా పెరుమండ్ల వీరేశం గౌడ్, కౌండిన్య యువజన విభాగం అధ్యక్షుడిగా సుద్దాల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా పెరుమండ్ల శ్రీనివాస్ గౌడ్, ఇతర సభ్యులను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన అధ్యక్షుడు గౌడ సంఘం యొక్క బలోపేతానికి, ఐక్యతకు తమవంతు కృషి చేస్తామని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ […]
సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేటలో సోమవారం ‘మేము’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రోగులకు సాయం అందించారు. కరోనా బాధితుడి కుటుంబానికి 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థఫౌండర్ పాకాల మహేశ్‌గౌడ్, సభ్యులు కల్లేపల్లి లక్ష్మణ్, ముదుగంటి సురేశ్, వెంకటరమణ, ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, మహిపాల్, గంగస్వామి పాల్గొన్నారు.