సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీపీ మాలోతు లక్ష్మి భీలునాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అక్కన్నపేట మండలంలోని చౌటపల్లితో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులు మాస్కులు ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గద్దల రమేశ్, […]
సారథిన్యూస్, రామాయంపేట: గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగించాలని మెదక్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పర్యటించారు. ఈ గ్రామానికి సీఎం కేసీఆర్ ఓఎస్డీ ( ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రాజశేఖర్‌రెడ్డి రూ. 1.64 కోట్లు మంజూరు చేయించారు. ధర్మారం రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామంలో […]
సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్రప్రభుత్వం పారిశుద్ధ్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నదని రామాయంపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన మెదక్ డీపీవో హనోక్ తో కలసి నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి దగ్గరే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ రెడ్డి, ఎంపీపీ […]
సారథి న్యూస్ నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం చాప్టా(కే) గ్రామ ప్రజల దాహం తీరింది. ఈ గ్రామంలో తాగునీరు లేక చాలా కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలోని బారడీ పొచమ్మ గుడివద్ద సర్పంచ్ బోర్ వేయించారు. ఈ బోర్లో రెండు ఇంచులు నీరు పడటంతో గ్రామస్థుల దాహం తీరినట్టైంది. బుధవారం ఓ బోర్‌కు మోటర్ బిగించారు. కార్యక్రమంలో సర్పంచ్ సవిత బసప్ప, ఉప సర్పంచ్ బీ రాజు, వార్డు మెంబర్లు, […]