Breaking News

క్వారంటైన్

మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. 28వ తేదీన జిల్లాలోని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంటకు చెందిన 54ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు టెస్టుల్లో తేలింది. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించి, కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేశారు. ఈ మేరకు ఆదివారం చేగుంటలో కరోనా సోకిన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను చికిత్స కోసం […]

Read More

క్వారంటైన్​ కు కరోనా అనుమానితులు

సారథి న్యూస్, రామడుగు : రామడుగు పీహెచ్​సీని కరీంనగర్​ డీఎంహెచ్​వో జి.సుజాత బుధవారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరాతీశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ముంబై, మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్​ లో ఉంటున్న వారికి పలు సూచనలు చేశారు. కరోనా లక్షణాలు గల అనుమానితులను జిల్లా క్వారంటైన్ కు రెఫర్ చేయాలని సూచించారు. ఆమె వెంట మండల వైద్యాధికారి శ్రీనివాస్ తో పాటు వైద్య […]

Read More

కూచిపూడిలో కరోనా.. హైరానా

క్వారంటైన్‌‌కు ఇద్దరి తరలింపు సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో కరోనా కలకలం చెలరేగింది. కూచిపూడి గ్రామస్తులతో బంధుత్వం కలిగిన ఓ వ్యక్తి హైదరాబాద్‌‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురికాగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌‌ వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చారు. అయితే ఆ ఎస్సైకి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌‌ రావడంతో ఆయనను కలిసిన వారిపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో […]

Read More

మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని గరిడేగావ్ గ్రామాల్లో గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కరోనా వైరస్ రిపోర్ట్ పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. మరో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఈ నెల 10న వచ్చిన ఆయన ఖేడ్ లోని పలు గ్రామాల్లో తిరిగి బంధువులను కలిసినట్లు గుర్తించారు. వారిలో దాదాపు 30మంది […]

Read More