హార్దిక్ పాండ్యా వీరోచిత బ్యాటింగ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్ సిడ్నీ: పొట్టి క్రికెట్లో టీమిండియా గట్టి సవాల్‌ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా ఒక మ్యాచ్మిగిలి ఉండగానే సీరిస్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2–0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ […]
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో అత్యంత మెరుగైన ఫిట్‌నెస్ కలిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్నెస్ను కాపాడుకోవడానికి చేసే కసరత్తులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన విరాట్.. కసరత్తులు మాత్రం మానలేదు. అతను చేసే కొత్త రకం ఎక్సర్సైజ్లకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. తాజాగా అతను పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగురుతూ పుష్ అప్స్ చేసే క్రమంలో నేలను తాకక ముందే […]
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లకు సంబంధించిన వస్తువులు, ఫొటోలను అభిమానులు తమ ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. అలాంటి క్రికెటర్లలో సచిన్, కపిల్, కోహ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఆసీస్‌లో అభిమానులు మరో అడుగు ముందుకేస్తూ తమ వీధులకు క్రికెటర్ల పేర్లను పెట్టుకున్నారు. మెల్బోర్న్లోని రాక్బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్‌లో వీధులకు ‘టెండూల్కర్ డ్రైవ్’,‘కోహ్లీ క్రీసెంట్’, ‘దేవ్ టెర్రెస్’ అని పేర్లు పెట్టుకున్నారు. మెల్టన్ కౌన్సిల్లోకి […]
న్యూఢిల్లీ: క్రికెట్ ఆడే తీరు వేరైనా.. కెప్టెన్సీలో గంగూలీ, కోహ్లీ ఒకేలా వ్యవహరిస్తారని టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయన్నాడు. ‘జట్టు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు గంగూలీ సారథ్యం అందుకున్నాడు. తనకున్న నాయకత్వ లక్షణాలతో టీమ్‌ను చాలా మెరుగుపర్చాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా కొన్ని ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే ఫిట్‌నెస్, ఫీల్డింగ్ లాంటి అంశాల్లో దాదాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగని లోపాలు లేని వారు ఎవరుంటారు? టీమ్‌కు […]
న్యూఢిల్లీ: ఫిట్‌నెస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చూసి సిగ్గుపడ్డామని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ తమీమ్ ఇక్బాల్ అన్నాడు. భారత క్రికెట్లో వస్తున్న మార్పులను తాము అనుసరిస్తామన్నాడు. ఫిట్ నెస్ విషయంలో కోహ్లీసేన తమ దృక్పథాన్ని మార్చేసిందన్నాడు. ‘పొరుగు దేశమైన భారత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి మాకూ ఉంటుంది. ప్రారంభంలో ఫిట్‌నెస్‌పై మాకు పెద్దగా అవగాహన లేదు. కానీ భారత్‌ను చూశాకా మా దృక్పథం మొత్తం మారిపోయింది. ఇప్పుడు మేం కూడా ఫిట్‌నెస్ విషయంలో చాలా […]
న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ జట్టు గందరగోళంగా ఆడిందని ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. లక్ష్యఛేదనలో సూపర్ ఫినిషర్ ధోనీలో కసి కనిపించలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 337/7 స్కోరు చేస్తే.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. ‘ఈ మ్యాచ్ మొత్తంలో ధోనీ, జాదవ్ బ్యాటింగ్ వింతగా అనిపించింది. ఈ ఇద్దరిలో ఏమాత్రం కసి కనిపించలేదు. భారీ సిక్సర్ల కొట్టాల్సిన సమయంలో సింగిల్స్ తీయడంపై దృష్టిపెట్టారు. 11 ఓవర్లలో 112 […]
అనుష్క కూడా ఉండాలి: కోహ్లీ న్యూఢిల్లీ: క్రీడాకారుల బయోపిక్ చిత్రాలు తీయడం ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. అందుకేనేమో.. కోహ్లీ కూడా తన బయోపిక్ కు రెడీ అంటున్నాడు. తానే నటిస్తానని కూడా చెబుతున్నాడు. అయితే ఇందులో తన భార్య అనుష్కశర్మ కూడా నటించాలని షరతుపెట్టాడు. లేకపోతే బయోపిక్ చేయనని స్పష్టం చేశాడు. ‘అనుష్కను కలవకముందు చాలా స్వార్థపూరితంగా ఉండేవాడిని. నా కంఫర్ట్ జోన్‌లో మాత్రమే బతికేవాడిని. మనం ప్రేమించే వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ల కోసం కూడా ఏదైనా […]
న్యూఢిల్లీ: మైదానం లోపలా, వెలుపలా ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలో లెజెండరీలు సచిన్, ధోనీ, కోహ్లీని చూసి నేర్చుకోవాలని పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కు అతని సోదరుడు కమ్రాన్ అక్మల్ సూచించాడు. ‘ఉమర్ కు నేనిచ్చే సలహా ఒక్కటే. నిజంగా తప్పు చేసి ఉంటే దానిని నుంచి పాఠం నేర్చుకోవాలి. జీవితమన్నాక చాలా ఆటంకాలు ఎదురవుతాయి. సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. కోహ్లీని తీసుకుంటే ఐపీఎల్ ప్రారంభంలో ఒకలా ఉండేవాడు. ఆ […]