Breaking News

కోదాడ

నేలకొరిగిన బూరుగ వృక్షం

నేలకొరిగిన అరుదైన వృక్షం

కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అశోక్ నగర్ వద్ద ఉన్న ఆసియాలో అరుదైన ఆఫ్రికన్ జాతికి చెందిన వృక్షం అదన్ సోనియా డిజిటేటన్ లీన్(బూరుగ వృక్షం) నేలకొరిగింది. రోడ్డు విస్తరణకు అడ్డం రాకపోయినా కావాలని కూల్చేశారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి వృక్ష జాతిని సందర్శనా ప్రదేశాలుగా మార్చి పర్యాటకులకు, విద్యార్థులకు వాటి ప్రాముఖ్యం తెలుపుతూ అందుబాటులో ఉంచేలా చూడాల్సిన ప్రభుత్వ అటవీ శాఖ యంత్రాంగం పట్టించుకోకపోతే భావితరాలు ఎలా విజ్ఞానం పొందుతారని ప్రజలు […]

Read More
ఆగస్టు 14వరకు లాక్డౌన్

ఆగస్టు 14 వరకు లాక్​డౌన్​

సారథి న్యూస్​, కోదాడ : పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ఈ నెల 31నుంచి ఆగస్టు 14వరకు లాక్​డౌన్​ విధించనున్నట్లు కోదాడ మున్సిపల్​ కమిషనర్​ మల్లారెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. వైరస్​ను కట్టడి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్​, రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలకు, మెడికల్​ షాపులకు లాక్​ డౌన్​ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ15రోజులపాటు స్వీయ నిర్బంధం పాటించాలని కమిషనర్​ […]

Read More

అంత్యక్రియలకు ఆమడదూరం

సారథి న్యూస్​, కోదాడ : సూర్యాపేట జిల్లా సాలార్​జంగ్​పేటకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్​ రావడంతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. కానీ పరిస్థితి విషమించి సోమవారం ఆస్పత్రిలోనే చనిపోవడంతో అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో మునిసిపల్ కమిషనర్ ఆదేశానుసారం అధికారులు, సిబ్బంది సహాయంతో రాత్రి 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్​స్పెక్టర్ దండు శ్రీను , హెల్త్ అసిస్టెంట్ మేరిగ అశోక్, జవాన్లు సిబ్బంది […]

Read More

సూర్యాపేటలో విజృంభిస్తున్న కరోనా

సారథిన్యూస్​, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కొత్తగా జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు నమోదైనట్టు సమాచారం. సూర్యాపేట జిల్లాకేంద్రంలో జమ్మిగడ్డ, అలంకార్ రోడ్, గడ్డిపల్లి, దోసపహాడ్, తిరుమలగిరి, (మాలిపురం) ప్రాంతాలతోపాటు కోదాడ, హుజూర్ నగర్ లలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Read More

జూలై 3న మహాధర్నా

సారథిన్యూస్​, కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న తలపెట్టిన ఐక్య కార్మిక సంఘాల ధర్నాను జయప్రదం చేయాలని కార్మికసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఐక్యకార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఉదయగిరి, ఐఎన్టీయూసీ నాయకులు కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read More